'ఇదొక భావోద్వేగం'

Telugu Lo Computer
0

 

ఒక మహిళ స్టీల్ టిఫిన్ పట్టుకుని దారిలో నడుచుకుంటూ వెళ్తున్న ఫోటోను నెటిజన్లతో పంచుకున్నారు.. "న్యూయార్క్, సెంట్రల్ పార్క్, డబ్బా వాలీ" అనే క్యాప్షన్‌తో ఈ ఫోటోను ఆగష్టు 19న షేర్ చేశారు. అమెరికాలోని న్యూయార్క్‌లో ఒక మహిళ ఆఫీస్‌కు వెళ్తూ స్టీల్ డబ్బాను తీసుకెళ్తున్నట్లు ఫోటోలో కనిపిస్తోంది. ముంబైలో పేరుమోసిన 'డబ్బావాలా' సేవలను గుర్తుచేసేలా ఈ ఫోటోకు డబ్బావాలి అని కామెంట్‌ పెట్టడంతో నెట్టింట్లో వైరల్‌గా మారింది. స్టీల్ టిఫిన్ బాక్స్‌లతో బలమైన అనుబంధం ఉన్న భారతీయులు ఈ ఫోటోను తెగ షేర్‌ చేస్తున్నారు. స్టీల్ టిఫిన్ బాక్స్‌ను తీసుకెళ్లడం మన దగ్గర సాధారణ విషయమే కానీ న్యూయార్క్‌లో కూడా ఒక మహిళ స్టీల్ డబ్బాను ఇలా తీసుకెళ్లడం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ. 'స్టీల్ డబ్బాస్.. చిన్ననాటి జ్ఞాపకాలకు తట్టి లేపాయి' అని భావేద్వాగానికి లోనవుతున్నారు. మరొకరు స్టీల్ డబ్బానే ఓ "భావోద్వేగం" అని కామెంట్‌ చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)