వుహాన్ లో మళ్లీ కరోనా కలకలం

Telugu Lo Computer
0

 


వుహాన్ లో  కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో వుహాన్ నగరంలోని 1.1 కోట్ల జనాభాకు కరోనా పరీక్షలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కరోనాను గుర్తించేందుకు న్యూక్లిక్ యాసిడ్ పరీక్షను ప్రారంభిస్తున్నామని లిటావో అనే ఓ సీనియర్ అధికారి మీడియాకు తెలిపారు. వుహాన్ లో కరోనా కేసులు వెలుగులోకి వచ్చిన వెంటనే కఠిన ఆంక్షలను విధించారు. దీంతో..అక్కడ వైరస్ అదుపులోకి వచ్చింది. ఏడాదిన్నర తర్వాత అక్కడ ఏడు కేసులు బయటపడ్డాయి. ఏడుగురు వలస కార్మికుల్లో ఆ కేసులను గుర్తించారు. ప్రస్తుతం చైనాలో డెల్టా వేరియంట్ వ్యాప్తి చెందటంతో దాదాపు అన్ని నగరాల్లో ఆంక్షల్ని విధిస్తున్నారు.వాటిని అమలు జరిగేలా కఠిన చర్యల్ని తీసుకుంటున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)