బళ్ళారి రాఘవ

Telugu Lo Computer
0


బళ్ళారి రాఘవ 1880 ఆగస్టు 2న అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో జన్మించారు.  ఆయన  పూర్తిపేరు తాడిపత్రి రాఘవాచార్యులు. తండ్రి నరసింహాచారి, తల్లి శేషమ్మ. రాఘవ తల్లిదండ్రులకు లేకలేక పుట్టిన బిడ్డ. అతను పుట్టకముందు బళ్ళారిలోని బసప్ప అన్న ఆధ్యాత్మిక గురువు ఆశీస్సులు తీసుకున్నారు. ఆ వెంటనే పుట్టిన బిడ్డ కావడంతో రాఘవకు మొదట బసప్ప అన్న పేరు పెట్టారు. క్రమేపీ వైష్ణవ సంప్రదాయానుసారం రాఘవాచార్యులున్న పేరు స్థిరపరిచారు. వారిది శ్రీవైష్ణవ శాఖకు చెందిన బ్రాహ్మణ కుటుంబం. తండ్రి తాడిపత్రి పురపాలక సంఘ పాఠశాలలో తెలుగు పండితునిగా పనిచేసేవారు. ఆంధ్ర నాటక పితామహునిగా పేరొందిన ధర్మవరం రామకృష్ణమాచార్యులు రాఘవకు స్వయానా మేనమామ.

రాఘవ ప్రాథమిక విద్య పూర్తిచేసి, ఎనిమిదవ యేట బళ్ళారిలోని పురపాలక సంఘ ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి మొదలుపెట్టాడు. పద్నాలుగవ యేట మెట్రిక్యూలేషన్ పూర్తిచేశారు. తర్వాత బళ్ళారిలోని వార్డ్ లా కళాశాలలో ఎఫ్.ఎ., మద్రాసులోని క్రిస్టియన్ కళాశాలలో బి.ఎ. పూర్తిచేశాru. బళ్ళారి తిరిగివచ్చి కొంతకాలం పాటు ఉపాధ్యాయునిగా, ఇంజనీరింగ్ గుమాస్తాగా పనిచేశారు.తిరిగి మద్రాసులో లా కాలేజీలో న్యాయవిద్య అభ్యసించి బి.ఎల్. పట్టా అందుకున్నారు.రాఘవకు బాల్యం నుంచే నటనలో, నాటకాల్లో ఆసక్తి ఉండేది. అది మరింత వికసించి మద్రాసులో చదివే రోజుల్లో అనేక నాటకాల్లో నటించి అనుభవం గడించేలా ఉపకరించింది. కర్నూలుకు చెందిన లక్షమణాచారి గారి కూతురు కృష్ణమ్మతో వివాహము జరిగింది. బళ్ళారి ఉన్నత పాఠశాల చేరి మెట్రక్ పూర్తి చేసి, మద్రాసులోని క్రిష్టియన్ కాలేజీలో న్యాయశాస్త్రం చదవడానికి చేరారు. న్యాయశాస్త్రంలో 1905లో ఉత్తీర్ణత పొందాక, మద్రాసులో న్యాయశాస్త్రాన్ని ప్రాక్టీసు చేయడం ప్రారంభించారు. కొద్దికాలంలోనే రాఘవ న్యాయవాదిగా, ముఖ్యంగా క్రిమినల్ కేసులు వాదించడంలో, ప్రసిద్ధి చెందారు.  ధనికుడయ్యారు.  ఆయన ప్రతిభను గుర్తించి అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఆయనను పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమించింది. "రావు బహద్దూర్" అన్న బిరుదు కూడా ఇచ్చింది. కానీ ఆయనకు నాటకాలలో ప్రత్యేకాభిమానం, ప్రతిభ ఉన్నాయి. బళ్ళారి రాఘవ నాటక ప్రదర్శనను చూడడం ఒక అద్భుతమైన అనుభూతి అని అప్పట్లో కళాప్రియులు చెప్పుకొనేవారు. తన సమయాన్ని, సంపదను నాటక రంగ పురోగతికోసం ధారాళంగా వెచ్చించారు. 1946, ఏప్రిల్ 16 న రాఘవ మరణించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)