సామెతలు...!

Telugu Lo Computer
0

 



* చెరువు గట్టుకు వెళ్ళి గట్టుమీద అలిగినట్టు !

* చుట్టుగుడిసంత సుఖము, బోడిగుండంత భోగమూ లేదన్నారు !

* జుట్టు అంటూ ఉంటే ఏ జడైనా వేసుకొవచ్చు!

* డబ్బివ్వని వాడు ముందు పడవెక్కుతాడు!

* డబ్బు కోసం గడ్డి తినే రకం!

* డబ్బుకు లోకం దాసోహం!

* డోలు వచ్చి మద్దెలతో మొరపెట్టుకున్నట్టు!

* డౌలు డస్తు పగలు పస్తు!

* డొంకలో షరాఫు ఉన్నాడు, నాణెము చూపుకో వచ్చును!

* తల్లిని మించిన దైవం లేదు!

* తంటల మారి గుఱ్ఱముకు తాటిపట్టె గొరపం!

* తండ్రి త్రవ్విన నుయ్యి అని అందులో పడి చావవచ్చునా!

* తంబళ అనుమానము!

* తంబళి తన లొటలొటే గాని, యెదటి లొటలొట యెరగడు!

* తగినట్టే కూర్చెరా తాకట్లమారి బ్రహ్మ!

Post a Comment

0Comments

Post a Comment (0)