కోవిడ్ బూస్టర్ డోసుతో తగ్గుతున్న ఇన్‌ఫెక్షన్‌

Telugu Lo Computer
0


డెల్టా వేరియంట్ వల్ల కొన్ని దేశాలు బూస్టర్ డోసు తీసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఇజ్రాయిల్‌లో ఇటీవల అదనపు కోవిడ్ టీకాలను ఇచ్చారు. మూడవ డోసు ఫైజర్ టీకా వల్ల 60 ఏళ్లు దాటిన వారిలో కరోనా ఇన్‌ఫెక్షన్ గణనీయంగా తగ్గినట్లు గుర్తించారు. ఈ విషయాన్ని ఆ దేశ ఆరోగ్య శాఖ అదివారం వెల్లడించింది. వ్యాక్సినేషన్ నిపుణుల కమిటీతో జరిగిన మంత్రిత్వశాఖ భేటీలో డేటాను ప్రజెంట్ చేశారు. అయితే డేటాకు సంబంధించిన పూర్తి వివరాలను ఇంకా వెల్లడించలేదు. డెల్టా వేరియంట్‌ను అడ్డుకునేందుకు అమెరికాతో పాటు పలు దేశాలు బూస్టర్ డోసులను ప్రోత్సహిస్తున్నాయి. ఇజ్రాయిల్‌కు చెందిన గెర్ట్నర్    ఇన్ స్టిట్యూట్, కేఐ ఇన్ స్టిట్యూట్ లు ఈ సర్వే చేపట్టాయి. బూస్టర్ డోసు వేసుకున్న పది రోజుల తర్వాత వైరస్ నుంచి రక్షణ.. రెండు డోసుల వేసుకున్న దాని కన్నా నాలుగు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు స్టడీలో తేలిందన్నారు. 60 ఏళ్ల వృద్ధులు, అపైబడిన వారిలో ఈ మార్పును గమనించారు.

60 ఏళ్లు దాటిన వారిలో 10 రోజుల్లో వైరస్ పట్ల రక్షణ ఆరు రెట్లుగా ఉందని అంచనా వేశారు. 60 ఏళ్లు దాటిన వారికి ఇజ్రాయిల్‌లో జూలై 30వ తేదీ నుంచి మూడవ డోసు ఇస్తున్నారు. అయితే తాజాగా బూస్టర్ డోసును 40 దాటిన వారికి కూడా ఇవ్వనున్నట్లు ఆ దేశం ప్రకటించింది. అయితే రెండవ డోసు తీసుకుని అయిదు నెలలు దాటినవారికి మాత్రమే మూడవ డోసు ఇస్తున్నారు. అమెరికాతో పాటు కెనడా, ఫ్రాన్స్‌, జర్మనీ దేశాలు కూడా బూస్టర్ డోసులను ఇస్తున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)