పిఎఫ్ ఖాతాకు ఆధార్ లింక్ తప్పనిసరి

Telugu Lo Computer
0

  


మీ  ఆధార్ కార్డును ప్రావిడెంట్ ఫండ్  ఖాతాలతో లింక్ చేసుకోవాలని, అలా చేయకపోతే డబ్బులు పడవని పేర్కొంది. ఇందుకు కార్మిక మంత్రిత్వ శాఖ సామాజిక భద్రత – 2020 చట్టంలో సెక్షన్ 142కు సవరణలు చేసింది. సెక్షన్ 142 కింద ఉద్యోగులు ఇతర ప్రయోజనాలు, సేవలను పొందడం కోసం ఆధార్ నెంబర్ ను లింక్ చేయాల్సిందేనని మరోసారి స్పష్టం చేసింది. పీఎఫ్ ఖాతాలకు ఆధార్ కార్డును లింక్ చేసుకోవాలని గతంలో ఈపీఎఫ్ఓ  సూచించిన సంగతి తెలిసిందే. ఆధార్ లింక్ గడువును 2021 జూన్ 01వ తేదీ నుంచి సెప్టెంబర్ 01వ తేదీ వరకు పెంచిన సంగతి తెలిసిందే. వచ్చే నెల నుంచి ఉద్యోగులు ఈపీఎఫ్ ఖాతాను ఆధార్ కార్డుతో అనుసంధానం చేయకపోతే…ఉద్యోగుల ఖాతాలో పీఎఫ్ డబ్బుల పడవని వెల్లడించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)