డెల్టాతో వణుకుతున్న అమెరికా !

Telugu Lo Computer
0



అమెరికా డెల్టా వైరస్ దెబ్బకు వణికిపోతోంది. గత పది రోజులుగా ఇక్కడ రెట్టింపు కేసులు నమోదవుతున్నాయి. దీంతో అమెరికా ప్రభుత్వం అప్రమత్తమైంది.  పది రోజుల క్రితంతో పోలిస్తే ప్రస్తుతం అక్కడ రెట్టింపు కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ముందు ముందు పరిస్థితులు మరింత దారుణంగా ఉంటాయని అమెరికా అంటువ్యాధుల నిపుణుడు ఆంథోనీ ఫౌచీ హెచ్చరించారు. ప్రజలంతా వీలైనంత తొందరగా టీకా తీసుకోవాలని కోరారు. రూపాలు మార్చుకుంటూ ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి అమెరికాలో మరోసారి విజృంభిస్తోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)