కృత్రిమ మెదడు సృష్టి!

Telugu Lo Computer
0


స్టెమ్‌ సెల్స్‌ నుంచి ల్యాబ్‌లో కృత్రిమంగా మానవుడి మెదడును  జర్మన్‌ శాస్త్రవేత్తలు సృష్టించారు. వీటిలో కళ్ళు కూడా అభివృద్ధి చేశారు. 60 రోజుల్లో దాదాపు 314 మినీ బ్రెయిన్లను తయారు చేసినా, రక్త సరఫరా లేకపోవడం వల్ల అవి మనుగడ సాధించలేకపోయాయి. ఈ మినీ మెదడులోని కళ్లు 5 వారాల పిండంలా అభివృద్ధి చెందినట్లు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. భవిష్యత్‌లో దీని నుంచి అనేక కొత్త విషయాలు వెల్లడవడమే కాకుండా, అనేక వ్యాధుల చికిత్సలో ముందడుగు కానున్నదనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ మినీ బ్రెయిన్‌ను జర్మనీలోని ఇన్‌స్టిట్యూట్ ఫర్ హ్యూమన్ జెనెటిక్స్ పరిశోధకులు తయారు చేశారు. ఈ పరిశోధన విషయాలను 'సెల్ స్టెమ్' జర్నల్‌లో ప్రచురించారు. మినీ బ్రెయిన్ 3 మి.మీ. వెడల్పు ఉన్నది. ఇందులో ఉండే కళ్లలో కార్నియా, లెన్స్, రెటీనా ఉన్నాయి. వీటి సహాయంతో మెదడు కాంతిని చూడగలుగుతుంది. ఈ కళ్ళు న్యూరాన్లు, నరాల కణాల సాయంతో మెదడుతో కూడా కమ్యూనికేట్ చేయగలవు. ప్రయోగశాలలో తయారు చేసిన ఈ రెటీనా భవిష్యత్‌లో వస్తువులను చూడలేని వ్యక్తులకు ఉపయోగకరంగా ఉంటుందని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పరిశోధన ప్రకారం, ఈ కళ్ళపై కాంతి కిరణాలు ప్రసరించినప్పుడు సంకేతాలు మెదడుకు చేరాయి. కళ్ళు చూసేవి మెదడుకు చేరుతున్నాయని ఇది రుజువు చేస్తుంది. ప్రయోగశాలలో అభివృద్ధి చేయబడిన మెదడులో ఇది మొదటిసారి చూడబడింది. కృత్రిమంగా తయారు చేసిన చిన్న మెదడు సాయంతో మానవ పిండం అభివృద్ధి సమయంలో, పుట్టుకతో వచ్చే రెటీనా రుగ్మతలలో రెటీనాపై కొన్ని రకాల ఔషధాలను పరీక్షించడం ద్వారా కన్ను, మెదడును ఎలా సంరక్షించుకోగలమో తెలుసుకోవడం సాధ్యమవుతున్నదని పరిశోధకుడు గోపాలకృష్ణన్ వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)