నెట్‌ నుండి అదృశ్యమైన తాలిబాన్‌ వెబ్‌సైట్‌లు

Telugu Lo Computer
0




తాలిబన్‌ అధికారిక వెబ్‌సైట్‌లు శుక్రవారం ఆలస్యంగా ఇంటర్నెట్‌ నుండి అదృశ్యమయ్యాయి. అఫ్ఘానిస్థాన్‌ను తాలిబాన్లు హస్తగతం చేసుకున్న అనంతరం పాష్టో, ఉర్దూ, అరబిక్‌, ఇంగ్లీష్‌, దరీ భాషల్లో ఉన్న వెబ్‌సైట్‌లు అకస్మాత్తుగా ఆఫ్‌లైన్‌లోకి వెళ్లాయి. సాంకేతిక సమస్యలా లేక మరేమైనా కారణాల రిత్యా ఈ వెబ్‌సైట్‌లు ఆఫ్‌లైన్‌లోకి వెళ్లాయి అన్న అంశం తెలియాల్సి వుంది. శుక్రవారం ప్రముఖ ఎన్‌క్రిప్టెడ్‌ మెసేజింగ్‌ సర్వీస్‌ వాట్సాప్‌ పలు తాలిబాన్‌ గ్రూపులను తొలగించింది. తాలిబాన్‌ కొత్త హోస్టింగ్‌ ఏర్పాట్లు చేస్తున్నందున వారి వెబ్‌సైట్‌లు అదఅశ్యం కావడం తాత్కాలికం కావచ్చునని కొందరు భావిస్తున్నారు. తాలిబన్‌ల ఖాతాలను తొలగించినట్లు వాట్సప్‌, ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌ స్పష్టం చేశాయి. తాలిబాన్‌ వెబ్‌సైట్‌లను తీసివేయడం వారి ఆన్‌లైన్‌ ఉనికిని తగ్గించడానికి ఇది మొదటి అడుగు మాత్రమే అని భావిస్తున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)