బిల్డింగ్‌ పైనుంచి దూకిన కుక్క !

Telugu Lo Computer
0


బిల్డింగ్‌ పైనుంచి దూకిన ఒక కుక్కను కిందపడకుండా పట్టుకుని ఒక వ్యక్తి కాపాడాడు. బ్రిటన్‌లోని స్టాఫోర్డ్‌షైర్‌లో ఈ ఘటన జరిగింది. జాక్ రస్సెల్‌ అనే పేరున్న ఒక కుక్క దారి తప్పి ఆదివారం కింగ్స్‌విన్‌ఫోర్డ్‌లోని మౌంట్ ప్లెసెంట్ పబ్‌లోకి ప్రవేశించింది. గమనించిన నిర్వాహకులు దాని యజమానిని గుర్తించే లోపు పబ్‌ బిల్డింగ్‌ పై అంతస్తులో ఉంచారు. తెరిచి ఉంచిన ఒక కిటికీ నుంచి తప్పించుకు నేందుకు కుక్క ప్రయత్నించింది. కిటికీ నుంచి రూఫ్‌పైకి దూకింది. అదుపు తప్పి కింద పడిపోతుండగా బార్‌ గార్డెన్‌లో ఉన్న పబ్‌ టీమ్‌కు చెందిన ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు ఆడమ్ రావెన్‌హాల్ గమనించాడు. వెంటనే ఆలస్యం చేయకుండా కుక్క పడబోయే చోటకు వచ్చి దానిని చేతులతో పట్టుకున్నాడు. కిందకు దించగా అది ఆ షాక్‌ నుంచి తేరుకుని పారిపోయింది. అయితే తాను పట్టుకోకపోతే ఆ చిన్న కుక్క కిందపడి ప్రాణాలు కోల్పోయి ఉండేదని ఆడమ్‌ చెప్పాడు. కాగా, అక్కడి సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. కుక్కను కాపాడిన ఆడమ్‌ను నెటిజన్లు ప్రశంసించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)