దివ్యాంగులకు మినహాయింపులు ఎత్తివేత

Telugu Lo Computer
0


కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర పోలీసు, సాయుధ బలగాల ఎంపికల్లో దివ్యాంగులకు మినహాయింపులు ఎత్తివేసింది. ప్రభుత్వ ఉద్యోగాలలో వికలాంగులకు (పీడబ్ల్యూడీ) తప్పనిసరి 4% రిజర్వేషన్ నుండి ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) కింద ఉన్న పోస్టులకు కేంద్రం మినహాయింపునిచ్చింది. ఇండియన్‌ పోలీస్‌ సర్వీస్‌ సహా.. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, ఢిల్లీ, అండమాన్, లక్షద్వీప్‌, దామన్, దాద్రానగర్ నగర్ హావేలి పోలీసు, కేంద్ర సాయుధ బలగాలు బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ, అసోం రైఫిల్స్‌లోని అన్ని రకాల ఉద్యోగాలకు దివ్యాంగులకు ఉన్న పలు మినహాయింపులను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. కేంద్రదివ్యాంగుల శాఖ ఛీఫ్‌ కమిషనర్‌ తో సంప్రదింపుల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంటూ కేంద్ర సామాజిక న్యాయశాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)