వెంకటాపురంలో ఆమీర్‌ ఖాన్‌ సందడి

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా  కొత్తపల్లి మండలం కొమరగిరి శివారు వెంకటరాయ పురంలో బాలీవుడ్‌ నటుడు అమీర్‌ఖాన్‌ శనివారం సందడి చేశారు. అమీర్‌ఖాన్‌ నటిస్తున్న లాల్‌సింగ్‌ చద్దా చిత్ర షూటింగ్‌ వెంకటరాయపురంలో జరుగుతోంది. రాధికా చౌదరితో కలిసి అమీర్‌ఖాన్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అద్వైక్‌ చందన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అమీర్‌ఖాన్‌తో పాటు కరీనాకపూర్, తెలుగు హీరో అక్కినేని నాగచైతన్య కూడా ఈ చిత్రంలో నటిస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది. హీరో అమీర్‌ఖాన్‌ను చూసేందుకు ఆయన అభిమానులు ఎగబడ్డారు. ఆయనతో కలిసి సెల్ఫీలు దిగారు.

Post a Comment

0Comments

Post a Comment (0)