నరేశ్‌పై హేమ ఆరోపణలు - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Header Ads Widget

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

ad

Saturday, 7 August 2021

నరేశ్‌పై హేమ ఆరోపణలు


మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) అధ్యక్షుడు నరేశ్‌పై నటి హేమ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఏడాది జరగనున్న ‘మా’ ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం రేసులోకి దిగుతున్న హేమ తాజాగా ఎలక్షన్స్‌ గురించి స్పందించారు. ఈ ఏడాది ‘మా’ అధ్యక్ష ఎన్నికలు వాయిదా పడేలా కొంతమంది చూస్తున్నారని, లేదా ఎన్నికలు లేకుండా నరేశ్‌నే అధ్యక్షుడిగా కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె వ్యాఖ్యలు చేశారు. అసోసియేషన్ నిధులను నరేశ్‌ విచ్చలవిడిగా ఖర్చుపెట్టారని విమర్శించారు. అధ్యక్ష పీఠం నుంచి దిగకుండా ఉండేందుకు నరేశ్‌ ప్రయత్నాలు చేస్తున్నారని ఆమె తీవ్రంగా ఆరోపించారు. ఈ మేరకు ఈరోజు ఉదయం 200 మంది అసోసియేషన్‌ సభ్యులకు హేమ లేఖలు రాశారు. ఏది ఏమైనా ఈ ఏడాది ‘మా’ అధ్యక్ష ఎన్నికలు జరిగేలా చూడాలంటూ వారందరి నుంచి ఆమె సంతకాలు సేకరించారు. ఈ మేరకు సభ్యులతో హేమ మాట్లాడిన వాయిస్ రికార్డ్ బయపడింది. ఎన్నికల కోసం పట్టుపట్టాలని సభ్యులంతా సంతకాలు చేయాలని కోరుతున్నట్లు ఆడియో రికార్డు లో హేమ స్పష్టం చేశారు. హేమ వాయిస్ రికార్డు బయటకు రావడంపై మా అసోసియేషన్ ఎన్నికలపై కొద్దిరోజుల నుంచి స్తబ్దుగా ఉన్న వాతావరణం మరోసారి వేడెక్కింది. ఇటీవలే మా ఎన్నికల వివాదంపై సమావేశమైన క్రమశిక్షణ కమిటీ సెప్టెంబర్ 12న మా ఎన్నికలు జరపాలని ప్రాథమికంగా నిర్ణయించింది. ఈ క్రమంలో హేమ వాయిస్ రికార్డు బయటికి రావడం అసోసియేషన్ లో దుమారం చెలరేగింది. ఏకంగా ప్రస్తుత అధ్యక్షుడు నరేశ్‌పై ఆరోపణలు చేయడం ఈ వివాదానికి మరింజ ఆజ్యం పోసినట్టైంది.

No comments:

Post a Comment

Post Top Ad