రెడ్‌మీ 10 స్మార్ట్‌ఫోన్ రిలీజ్

Telugu Lo Computer
0

 


రెడ్‌మీ 10 స్మార్ట్‌ ఫోన్ రిలీజ్ అయింది. ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉండటం విశేషం. క్వాడ్ కెమెరా సెటప్, 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే మీడియా టెక్ హీలియో జీ88 ప్రాసెసర్ లాంటి ప్రత్యేకతలున్నాయి. రెడ్‌మీ 10 స్మార్ట్‌ ఫోన్ మూడు వేరియంట్లలో రిలీజ్ అయింది. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ.13,300 కాగా, 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,800. ఇక హైఎండ్ వేరియంట్ ధర సుమారు రూ.16,200. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్‌ను గ్లోబల్ మార్కెట్‌కు పరిచయం చేసింది షావోమీ. ఇండియాలో ఎప్పుడు రిలీజ్ అవుతుందన్న స్పష్టత లేదు. అయితే రెడ్‌మీ ఇండియా ట్విట్టర్‌లో కొన్ని టీజర్లు రిలీజ్ చేస్తోంది. ఆ టీజర్లను బట్టి ఇండియాలో త్వరలో రెడ్‌మీ 10 సిరీస్ స్మార్ట్‌ఫోన్లు రిలీజ్ కావొచ్చని అంచనా వేయొచ్చు. అయితే మొదట రెడ్‌మీ 10 స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అవుతుందా లేక రెడ్‌మీ 10 ప్రైమ్ రిలీజ్ అవుతుందా అన్నది ఇంకా తెలియరాలేదు. 

Post a Comment

0Comments

Post a Comment (0)