భర్తను హత్య చేసిన భార్య !

Telugu Lo Computer
0


నెల్లూరు జిల్లా కోవూరు కొత్త దళిత వాడకు చెందిన బండికాల రవీంద్ర అనే పాస్టర్ ఈనెల 7న అనుమానాస్పద స్ధితిలో మృతి చెందాడు. తన భర్త మృతిపై అనుమానాలున్నాయని భార్య సమత పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టటంతో ఫిర్యాదుదారే లొంగిపోయింది. కొత్తూరు దళితవాడకు చెందిన సమతకు, కలువాయి మండలం పెరమనకొండకు చెందిన బండికాల రవీంద్రతో 14 ఏళ్ల క్రితం వివాహం అయ్యింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెళ్లైన కొన్నాళ్లకు కొత్తూరు దళితవాడకు మకాం మార్చారు. రవీంద్ర అల్లూరు మండలంలో ఒక చర్చిలో పాస్టర్ గా పని చేస్తున్నాడు. సమత కోవూరు శాంతినగర్-2 ప్రాంతానికి వలంటీర్ గా  పని చేస్తోంది. ఈనెల 6వ తేదీ అందరూ నిద్రిస్తుండగా అర్ధరాత్రి వేళ సమతకు సన్నిహితంగా ఉండే ఉపర్తి రాము అనే ఆటో డ్రైవర్ కు ఫోన్ చేసి ఇంటికి పిలిపించుకుంది. వాళ్ళిద్దరూ సన్నిహితంగా ఉన్నసమయంలో రవీంద్ర నిద్రలేచి చూశాడు. అది గమనించిన రాములు, సమత రవీంద్ర ముఖానికి దిండు అడ్డం పెట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. రాము, రవీంద్ర మృతదేహాన్ని తన ఆటోలో తీసుకెళ్లి ఏసీసీ కళ్యాణ మండపం వద్ద జాతీయ రహదారిపై పడేసి, ముఖం గుర్తు పట్టకుండా ఉండేందుకు బండరాయితో కిరాతకంగా కొట్టి వెళ్లి పోయాడు. మర్నాడు జాతీయ రహదారి సమీపంలో గుర్తు తెలియని మృతదేహాన్ని చూసిన స్ధానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్ధలానికి వచ్చిన పోలీసులు అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసుకున్నారు. విచారించగా పాస్టర్ రవీంద్రగా తేలింది. భర్త శవాన్ని గుర్తించిన సమత ఏమీ తెలియనట్లు తన భర్త ఒంటిపై గాయాలున్నాయని అతని మృతిపై అనుమానం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు తీసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రవీంద్ర గాయల వల్ల చనిపోలేదని ఊపిరాడకుండా చేయటం వలన చనిపోయాడని పోస్టుమార్టం నివేదికలో తేలింది. అనుమానాస్పద మృతి కేసును హత్య కేసుగా మార్చి పోలీసులు విచారణ చేపట్టారు. ఈక్రమంలో చేసిన తప్పుకు భయపడి సమత రాము సోమవారం తహసీల్దార్ సుబ్బయ్య ఎదుట లొంగిపోయారు. ఈమేరకు నిందితులను పోలీసులు కోర్టులో హాజరు పరిచి రిమాండ్ కు తరలించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)