జొమాటో నుంచి త్వరలో కిరాణా సామాన్లు!

Telugu Lo Computer
0





ఫుడ్‌ డెలివరీకే  పరిమితమైన జొమాటో త్వరలో కిరాణా సామానుల విక్రయాలను ప్రారంభించ నుంది. యాప్‌ ద్వారా ఆన్‌లైన్‌ విక్రయాలకు తెరతీయనున్నట్లు కంపెనీ సీఎఫ్‌వో అక్షంత్‌ గోయల్‌ పేర్కొన్నారు. రూ. 9,375 కోట్ల సమీకరణకు ఈ నెల 14 నుంచి పబ్లిక్‌ ఇష్యూకి రానున్నది.  కంపెనీ ఇటీవలే ఆన్‌లైన్‌ గ్రోసరీ సంస్థ గ్రోఫర్స్‌లో 10 కోట్ల డాలర్లు (రూ. 745 కోట్లు) ఇన్వెస్ట్‌ చేసింది. దేశీయంగా కిరాణా సామానుల విభాగంలో భారీ అవకాశాలున్నట్లు ఈ సందర్భంగా గోయల్‌ తెలియజేశారు. ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ విభాగం వేగంగా వృద్ధి చెందుతున్నట్లు పేర్కొన్నారు. దీంతో నిత్యావసర వస్తువుల బిజినెస్‌లో ప్రయోగాలు చేస్తున్నట్లు తెలియజేశారు. ఈ విభాగంలో మరింత విస్తరించే యోచనతోనే గ్రోఫర్స్‌లో ఇన్వెస్ట్‌ చేసినట్లు వెల్లడించారు. జొమాటో యాప్‌ ద్వారా త్వరలోనే ఆన్‌లైన్‌ గ్రోసరీ విక్రయాలను ప్రారంభించనున్నట్లు వివరించారు. వచ్చే వారం ప్రారంభంకానున్న జొమాటో ఐపీవోకు రూ. 72-76 ప్రైస్‌ బ్యాండ్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. 

Post a Comment

0Comments

Post a Comment (0)