తాప్సీ ప్రొడక్షన్‌ హౌస్‌ ప్రారంభం

Telugu Lo Computer
0


కేవలం నటిమణులుగానే కాదు.. నిర్మాతలుగానూ సత్తా చాటుతామని నిరూపిస్తున్నారు బాలీవుడ్‌ భామలు. 2013లో అనుష్క శర్మ ‘క్లీన్‌ స్లేట్‌ ఫిలిం’, 2015లో ప్రియాంకా చోప్రా ‘పర్‌పుల్‌ పెబల్‌ పిక్చర్స్‌‌’ 2020లో కంగనా రనౌత్‌ ‘ మణికర్ణిక ఫిలిం ప్రొడక్షన్‌’ను స్థాపించారు. తాజాగా ఆ జాబితాలో దిల్లీ ముద్దుగుమ్మ తాప్సీ  సైతం చేరారు. ఇదే విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకున్న ఆమె తన ప్రొడక్షన్‌ హౌస్‌ పేరు ‘ ఔట్‌ సైడర్‌ ఫిలిమ్స్‌’ అని వెల్లడించారు. "నా స్నేహితుడు ప్రాంజల్‌తో కలిసి ఈ నిర్మాణానికి శ్రీకారం చుట్టా. మీ అందరి ఆశీస్సులు కావాలి’’ అంటూ తన ప్రొడక్షన్‌ హౌస్‌ గురించి ప్రకటించారు తాప్సీ. అంతేకాదు.. తాను నిర్మాతగా వ్యవహరించే తొలి చిత్రం ‘బ్లర్‌’ని జీ స్టూడియోస్‌తో కలిసి నిర్మిస్తున్నామని తెలిపారు. అజయ్‌ భాల్‌ దీనికి దీనికి దర్శకత్వం వహించనున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)