తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు

Telugu Lo Computer
0


తెలంగాణలో రాగల  మూడు రోజులలో  వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన  ఉపరితల ఆవర్తనం దక్షిణ ఛత్తీస్ ఘడ్, దాని పరిసర ప్రాంతాల మీద కొనసాగుతుందని అధికారులు తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షములు పడే అవకాశం ఉందని, రేపు ఉత్తర తెలంగాణా జిల్లాలలోని చాలా చోట్ల  భారీ  నుండి అతి భారీ వర్షాలు, ఎల్లుండి మరికొన్నిచోట్ల  భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)