టాయ్‌లెట్‌ కి వెళ్తే డబ్బులిస్తారు...!

Telugu Lo Computer
0


దక్షిణా కొరియాలో టాయ్‌లెట్‌ ఉపయోగిస్తే డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. పైగా మనకే తిరిగి డబ్బులిస్తారు. ఆ టాయ్‌లెట్‌లో ఓ క్యూ ఆర్ కోడ్ ఉంటుంది. ఆ కోడ్‌ను స్కాన్ చేస్తే డబ్బులు నేరుగా మీ అకౌంట్‌లో వచ్చి పడతాయి. ఉల్సాన్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో పనిచేసే అర్బన్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ చో జై-వూన్ ఆ టాయ్‌లెట్‌ను రూపొందించారు. ఆ టాయ్‌లెట్ మానవ వ్యర్థాలతో విద్యుత్‌ను తయారు చేస్తుంది. టాయ్‌లెట్ ద్వారా ఒక ట్యాంక్‌లోకి వెళ్లేలా చేస్తారు. వాటికి కొన్ని రకాల సూక్ష్మజీవులను ఊపయోగించి మానవ వ్యర్థాలను మీథేన్‌గా మారుస్తారు. ఆ మీథేన్ సహాయంతో హాట్ బాయిలర్, గ్యాస్ స్టవ్, ఇతర ఎలక్ట్రానిక్ వంటి పరికరాలకు విద్యుత్ ను అందించవచ్చు. దీని ద్వారా విద్యుత్, బయో గ్యాస్, ఎరువులను తయారు చేస్తున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)