ఆమె ఓ కామపిశాచి!

Telugu Lo Computer
0



కాలిఫోర్నియాలో సంచలనం రేపిన ప్రెస్నో కౌంటీ జైల్‌ అధికారిణిగా పనిచేసిన టీనా గోన్‌జలెస్‌ తన  శృంగారానికి ఫలితం అనుభవించింది. మగ ఖైదీల పర్యవేక్షణ, సవరణల అధికారిణిగా మూడేళ్లపాటు పని చేసిన సమయంలో  ఖైదీలపై లైంగిక వేధింపులకు పాల్పడిందన్నది ఆమెపై నమోదైన ప్రధాన ఆరోపణ. నగ్నంగా వీడియో కాల్స్‌ మాట్లాడాలని, ఫోన్‌ కాల్స్‌లో శృంగార సంభాషణలు కొనసాగించాలని ఆమె ఖైదీలను బెదిరించేది. కొందరు ఖైదీలు తెగించి.. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేరవేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆమెను విధుల నుంచి సస్పెండ్‌ చేసిన అధికారులు.. గత మే నెలలో ఆమెను అరెస్ట్‌ కూడా చేశారు.  దర్యాప్తు సమయంలో గోన్‌జలెజ్‌ జైల్లో పాల్పడ్డ వికృత చేష్టలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి. విడుదలైన ఖైదీల నుంచి, అధికారుల నుంచి స్టేట్‌మెంట్‌ రికార్డు చేసిన అధికారులు.. ఆ వివరాల్ని జడ్జి ముందు ఉంచారు. ఖైదీలపై తన కామ వాంఛల్ని తీర్చుకునేందుకు ఆమె ఘోరంగా ప్రవర్తించేదని తేలింది. ఒకరితో శృంగారంలో పాల్గొంటున్నప్పుడు.. మిగతావాళ్లను కన్నార్పకుండా చూడాలని కండిషన్‌ పెట్టేది. ఇక వాళ్లకు పోర్న్‌ వీడియోలు చూపించి.. అందులో మాదిరి పాల్గొనాలని ఒత్తిడి చేసేది. అంతేకాదు శృంగారంలో పాల్గొనడానికి వీలుగా తన యూనిఫామ్‌కు ఆమె రంధ్రాలు చేసుకునేదని నివేదిక ఇచ్చారు అధికారులు. ఆ అకృత్యాల రిపోర్ట్‌ను చూసి జడ్జి సైతం బిత్తరపోయాడు. గోన్‌జలెజ్‌ మీద వృత్తిపరమైన ఫిర్యాదులు కూడా ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఖైదీలకు రేజర్లు, సెల్‌ఫోన్లతో పాటు మద్యం, డ్రగ్స్‌ సప్లై చేసేదని, ‘సెక్స్‌ రిటర్న్‌ గిఫ్ట్‌’లుగా వాటికి పేరు పెట్టిందని ఓ మాజీ ఖైదీ జడ్జి ముందు వాపోయాడు. ఇక ఆమెపై నమోదైన ఆరోపణలన్నీ నిజమేనని జైలు మాజీ అధికారి, ఈ నివేదికను రూపొందించిన స్టీవ్‌ మెక్‌కోమాస్‌ కోర్టుకు వెల్లడించాడు. నిందితురాలి తరపున కౌన్సెలర్‌ మాట్లాడుతూ.. ఆ టైంలో గోన్‌జలెస్‌ వైవాహిక జీవితం అర్థాంతరంగా ముగిసింది. ఆ బాధలోనే ఆమె అలా ప్రవర్తించిందని తెలిపాడు. ఆమె మానసిక స్థితిని పరిగణనలోకి తీసుకుని క్షమించండి’ అని వేడుకున్నాడు. ఇంతటి దారుణాలకు పాల్పడ్డ ఆమెను జడ్జి ఒక ‘కామ పిశాచి’గా వర్ణించడం విశేషం. ‘నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకున్నావ్‌. మూర్ఖంగా వ్యవహరించావు. మిగతా జీవితం అయినా మంచిగా బతుకు’ అని తీర్పు వెలువరించే ముందు జడ్జి వ్యాఖ్యానించాడు. కాగా, ఆమెకు నేర చరిత్ర లేకపోవడంతో మూడేళ్ల ఎనిమిది నెలలు శిక్షతో సరిపెట్టాడు జడ్జి. 

Post a Comment

0Comments

Post a Comment (0)