సామెతలు....! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 31 July 2021

సామెతలు....!


* కాగల కార్యం గంధర్వులే తీర్చారు !

* కాపురం చేసే కళ కాళ్ళ పారాణి దగ్గరే తెలుస్తుంది  !

* కార్చిచ్చుకు గాడ్పు తోడైనట్లు  !

* కాలు కాలిన పిల్లిలా  !

* కాలం కలిసి రాకపోతే కర్రే పామవుతుంది  !

* కాలం కలిసి వస్తే ఏట్లో వేసినా ఎదురు వస్తుంది  !

* కాళ్లకు రాచుకుంటే కళ్లకు చలువ  !

* కాసుకు గతిలేదుకానీ... నూటికి ఫరవాలేదన్నట్లు  !

* 'కురూపీ, కురూపీ ఎందుకు పుట్టేవే?' అంటే 'స్వరూపాలెంచటానికి అందిట  !.

* కుంచెడు గింజల కూలికి పోతే.. తూమెడు గింజలు దూడమేసినట్లు  !

* కుప్ప తగులపెట్టి.. పేలాలు ఏరుకుతిన్నట్లు... !

* కూటికి లేకున్నా కాటుక మాననట్లు  !

* కూడూ గుడ్డా అడక్కపోతే బిడ్డను సాకినట్లు సాకుతా అన్నాడట  !

* కూనను పెంచితే గుండై కరవ వచ్చినట్లు  !

* కొండముచ్చు పెండ్లికి కోతి పేరంటాలు  !

* కొడితె కొట్టాడులే కానీ కొత్తకోక తెచ్చాడులే అందిట  !

No comments:

Post a Comment