సూర్యనమస్కారాలు విటమిన్‌ "డి" కోసమా? - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Header Ads Widget

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

ad

Wednesday, 7 July 2021

సూర్యనమస్కారాలు విటమిన్‌ "డి" కోసమా?

 

శరీరానికి ఎండతగటలం వలన శరీరంలో డివిటమిన్‌ తయారవుతుందన్నది నిజం. ఇది శాస్త్రీయంగా నిరూపితమైన అంశం. కాని సూర్య నమస్కారాలు కొన్ని వందల సంవత్సరాలనుండి ఈ దేశంలో జరుగుతున్నాయి. సూర్య నమస్కారాలు ప్రారంభమైననాటినుండి క్రీ.శ. 1912 వరకు అసలు విటమిన్‌లు అనేవి మానవాళికే తెలియదు. 1912 లో మాత్రమే విటమిన్‌లను తొలిసారిగా కనుకున్నారు. అసలు విటమిన్లు అన్న  విషయమే తెలియని రోజుల్లో సూర్య నమస్కారాలు డి విటమిన్‌ కోసమే ఏర్పాటు చేశాని చెప్పటం మోసంకాదా? 

శరీరానికి ఎండ తగలటం కోసం సూర్య నమస్కారాలే చేయవలసిన అవసరం ఏముంది? అసలీ సూర్యనమస్కారాల అవసరం ఎవరికి ఉంది? రోజు వారీ పోలాల్లో పని చేసే రైతులు, వ్యవసాయంతో సహా వివిధ పనులుచేసేకూలీలు, అనేకమంది చేతివృత్తులవారు, వారివృత్తులలో భాగంగా ఎండలో ఎంతోకొంత సమయం ఉంటారు. అలాగే అనేక క్రీడలు ఆడే క్రీడాకారులు ఎండలోనే ఆడతారు. వీరందరికి వారి ప్రమేయం లేకుండానే డి విటమిన్‌ తయారవుతుంది. అలాగే అనేక ఇతర దేశాలలో ముఖ్యంగా యూరపు దేశాలలో చలి ఎక్కువ. వారికి ఎండ రావటం తక్కువగా ఉంటుంది. అందువలన ఎండవచ్చిన రోజున ఎండలో కూర్చుంటారు. లేదా సన్‌బాత్‌ ( ఎండతో స్నానం) పేరుతో సముద్రాలు నదులు ఒడ్డున ఎండ తగిలేవిధంగా కూర్చుంటారు.   వారెవరూ సూర్యనమస్కారాలు చేయరు. మన దేశంలో కాని ఇతర దేశాలలో కాని వీరంతా  సూర్య నమస్కారాలతో పని లేకుండానే విటమిన్‌ డి పొందుతున్నారు.

ఈ సూర్య నమస్కారాలు భారత దేశంలో మాత్రమే ఉన్నాయి. భారత దేశంలో కూడా ఎండ ముఖం చూడకుండా బ్రతికే వాళ్ళకు మాత్రమే ఎండలో ఉండవలసిన అవసరం వస్తుంది. కులవ్యవస్థ నెలకొని ఉన్న భారతదేశంలో అత్యధికులు గా ఉన్న శూద్రులు,దళితులు, గిరిజనులు నిత్యం కష్టపడి పని చేసేవారు. వారందరూ అనివార్యంగా ఎండకు గురవుతారు. అందుకే వారెవరూ ఈ సూర్య నమస్కారాలజోలికి వెళ్లరు. ఎండలో ఉండాలి అన్న ఆలోచనే వారికి ఉండదు. కొన్ని వృత్తులు చేసేవారౖేెతే ఎండనుండి తప్పుకొని నీడ దొరికితే చాలనుకుంటారు.ఎండకు గురి కాకుండా ఉండే సెక్షన్లకు మాత్రమే ఎండలో ఉండవలసిన అవసరం   ఉంటుంది. కనుక సూర్య నమస్కారాలు అన్నది ఏనాడూ భారత దేశ ప్రజలు మొత్తం ఆచరించింది కాదు. కనీసం అత్యధికులు ఆచరించింది కూడా కాదు. ఎండలో ఉండేది విటమిన్‌ డి కోసమే అయితే సూర్య నమస్కారాలే చేయవలసిన అవసరంలేదు. సూర్య నమస్కారాలు అన్నది పురోహిత వర్గం సృష్టి.  ఇప్పటికీ ఎక్కువ ఆచరించేది పురోహితవర్గమే. 

అయితే కొద్దిమంది పురోహిత వర్గం ఆచరించే దానిని ఇది భారతీయ సంప్రదాయం అని చెప్పటం బూటకం. ఇది నిజమని నమ్మించటం కోసం ఆధునిక సైన్సు నిర్థారించిన అంశాలను జోడిరచి, మన పూర్వీకులకు ఇదంతా ముందే తేలిసే ఇలా  చెప్పారు అని చెప్పటం మరీ బూటకం. నిజానికి ఎండలో ఉండటం వేరు. సూర్యునికి నమస్కరించటం వేరు. సూర్యునికి నమస్కరించటం కోసం అనివార్యంగా ఎండలోకి రావాల్సి ఉంటుంది. అంతేకాని ఎండలో ఉండటంకోసం సూర్య నమస్కారాలు చేయటం లేదు. మనది అసలే ఉష్ణ దేశం.ఎండల కోసం విదేశీయులు లాగా మనం తపించనవసరంలేదు. సూర్య నమస్కారాలు అన్నవి ఇతర దేవతల మాదిరిగానే సూర్యుణ్ణి పూజించటం కోసం ఏర్పాటు చేసుకున్నవి. ఇతర దేవతల పూజా విధానాలను ఏర్పాటు చేసిన పురోహిత వర్గమే సూర్యనమస్కారాలను కూడా ఏర్పాటు చేసింది. అయితే నిత్యం ప్రత్యక్షంగా కనుపించే సూర్యునికి ఇంట్లో విగ్రహాన్ని పెట్టి పూజించనవసరంలేదు. విగ్రహాలు పెట్టి పూజించనవసరం లేక పోవటంతో ఇతర దేవతల విషయంలో మాదిరిగా జనంలోకి ఇది ఎక్కలేదు. అందువలనే ఇది దేశంలోని ఇతర జనాలలోకి అంతగా వ్యాపించలేదు. ఇప్పుడు ఆధునిక సైన్సు నిర్థారించిన విటమిన్‌ డి అంశాన్ని జోడిరచి తాము ఆచరించేదానిని ఇతరుల మీద తమ మూఢత్వాన్ని రుద్దటానికి ప్రయత్నిస్తున్నారు.

విటమిన్‌ డి కోసం ఎండలో ఉండండి అని వైద్యులు రోగులకు చెబుతుంటారు. ఎండలో నిలబడితే విటమిన్‌ డి వస్తుందా? వస్తుంది. ఎప్పుడు? శరీరం సూర్యరశ్మిని ఉపయోగించుకొని విటమిన్‌ డి తయారు చేసుకోగలిగినంత ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే స్యూర్యశ్మివలన విటమిన్‌ డి తయారవుతుంది. శరీరంలో ఏదో ఒక అనారోగ్యపరిస్థితి వలన విటమిన్‌ డి పడిపోయినప్పుడు. స్యూర్యశ్మివలన విటమిన్‌ డి తయారు చేసుకునే శక్తి శరీరానికి ఉండదు.  ఆ సమయంలో ఎండలో నిలబడ్డా. సూర్యనమస్కారాలు చేసినా విటమిన్‌ డి తయారుకాదు. ముందు ఆలోపాన్ని సవరించటం కోసం వైద్యులు విటమిన్‌ డి బూస్టర్‌ డోసులను ఎనిమిది వారాలపాటు ఇస్తారు. ఆలోపం సరైన తర్వాత సూర్యరశ్మిలో విటమిన్‌ డి తయారు చేసుకునే శక్తి శరీరానికి వస్తుంది.

No comments:

Post a Comment

Post Top Ad