సామెతలు...!

Telugu Lo Computer
0



* ఏనుగు చచ్చినా వెయ్యే - బ్రతికినా వెయ్యే ! 

* ఎక్కరానిచెట్టు మీద కొక్కిరాయి గుడ్డు పెట్టింది !

* ఏకులా వచ్చి మేకులా తగులుకున్నట్టు !

* ఏ మొగుడు దొరక్కుంటే అక్క మొగుడే దిక్కన్నట్లు !

* ఏ ఎండకి ఆ గొడుగు ! 

* ఏటి ఇసుక ఎంచలేం తాటి మాను తన్నలేం, ఈత మాను విరచలేం !

* ఏడ్చే మగాడిని నవ్వే ఆడదాన్ని నమ్మరాదు !

* ఏడ్చే వాడికి ఎడమ పక్కన, కుట్టే వాడికి కుడి పక్కన కూర్చున్నట్లు !

* ఏదుం తిన్నా ఏకాసే, పందుం తిన్నా పరగడుపే !

* ఏనుగుల్ని తినే స్వాములోరికి పచ్చ గడ్డి పలహారం అన్నట్లు !

* ఏనుగులు మింగేవాడికి పీనుగల పిండాకూడు !

* ఏనుగు నెత్తి మీద ఏనుగే మన్ను పోసుకున్నట్లు !

* ఏనుగులు పడితే ఏనుగులే లేపాలి కాని పీనుగుల వల్ల కాదు

* ఏమండీ కరణం గారూపాతర లో పడ్డారే అంటే, కాదు మషాకత్తు చేస్తున్నాను అన్నాడట !

* ఏరు ఏడామడ ఉండగానే చీర విప్పి చంకన బెట్టుకొందట !

 


Post a Comment

0Comments

Post a Comment (0)