ఐసీఐసీఐ కొత్త స‌ర్వీస్ ఛార్జీలు !

Telugu Lo Computer
0



ఆగ‌స్టు 1 నుండి ఐసీఐసీఐ స‌ర్వీస్ ఛార్జీలు మార‌నున్నాయి. ఐసీఐసీఐ వినియోగ‌దారుల‌కు 6 మెట్రో న‌గ‌రాల్లో మొద‌టి 3 లావాదేవీల (ఆర్థిక, ఆర్థికేత‌ర) సేవ‌లు ఉచితంగా ల‌భిస్తాయి. ఐసీఐసీఐ బ్యాంకు న‌గ‌దు లావాదేవీ, ఏటీఎం ఇంట‌ర్‌ఛేంజ్‌, చెక్‌బుక్ ఛార్జీలు ఆగ‌స్టు 1 నుండి మార‌తాయి.

* ఐసీఐసీఐ బ్యాంకు ఏటీఎంలో నెల‌కు మొత్తం 4 ఉచిత న‌గ‌దు లావాదేవీల‌ను అనుమ‌తించింది. ప్రతి అదనపు లావాదేవీకి రుసుము వసూలు చేస్తారు.

* ఐసీఐసీఐ వినియోగ‌దారుల‌కు 6 మెట్రో న‌గ‌రాల్లో మొద‌టి 3 లావాదేవీల (ఆర్థిక, ఆర్థికేత‌ర) సేవ‌లు ఉచితంగా ల‌భిస్తాయి.

* మెట్రో న‌గ‌రాలు కాకుండా అన్నిఇత‌ర ప్ర‌దేశాల‌లో, మొద‌టి 5 లావాదేవీలు ఉచితం.

* బ్యాంకు ప్ర‌తి ఆర్థిక లావాదేవీకి రూ. 20, ఆర్థికేత‌ర లావాదేవీకి రూ. 8.50 వ‌సూలు చేస్తుంది.

* హోం బ్రాంచిలో న‌గ‌దు లావాదేవీ ప‌రిమితి నెలకు రూ.1 ల‌క్ష వరకు ఉచితం. అది దాటితే ప్రతి రూ.1000కి రూ.5 ఛార్జీ ప‌డుతుంది. క‌నిష్ఠంగా రూ.150కు లోబ‌డి ఉంటుంద‌ని బ్యాంక్ తెలిపింది.

* నాన్ హోమ్ బ్రాంచ్ వ‌ద్ద రోజుకు రూ. 25,000 వ‌ర‌కు న‌గ‌దు లావాదేవీల‌కు ఛార్జీలు లేవు. రూ. 25,000 పైన రూ.1000కి రూ.5 ఛార్జీ ప‌డుతుంది. క‌నీసం రూ. 150కి లోబ‌డి ఉంటుంది.

* థ‌ర్డ్‌ పార్టీ లావాదేవీల ప‌రిమితి రోజుకు రూ. 25,000గా నిర్ణ‌యించారు. రూ. 25,000 ప‌రిమితి వ‌ర‌కు ప్ర‌తి లావాదేవీకి రూ.150 ఛార్జీ ఉంటుంది. రూ. 25,000 ప‌రిమితికి మించి న‌గ‌దు లావాదేవీలు అనుమ‌తి లేదు.

* ఒక నెల‌లో మొద‌టి 4 లావాదేవీల‌కు  ఛార్జీలుండ‌వు. ఆ త‌ర్వాత రూ.1000 లావాదేవీకి రూ. 5 ఛార్జీ, క‌నీసం రూ.150కి లోబ‌డి ఉంటుంది.

* ఒక సంవ‌త్స‌రంలో తీసుకున్న 25 చెక్‌లున్న చెక్ బుక్‌కి ఛార్జీలు లేవు. ఆ త‌ర్వాత అదే సంవ‌త్స‌రంలో 10 చెక్‌లున్న చెక్ బుక్ తీసుకుంటే బ్యాంక్ రూ. 20 వ‌సూలు చేస్తుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)