అందాల రైలు మళ్లీ వచ్చింది !

Telugu Lo Computer
0


కొండలు, గుహలు దాటుకుంటూ ముందుకు సాగింది. దీంతో.. ఇన్నాళ్లూ అరకు ఆహ్లాదానికి దూరమైన పర్యాటకులు ఇప్పుడు ఈ రైలు పునరుద్ధరణతో క్యూ కడుతున్నారు. కొత్తవలస- కిరండోల్‌ మధ్య నడిచే రైలును అధికారులు పునరుద్ధరించారు. అరకు రూట్లో నడిచే ఏకైక పాసింజర్ రైలు కావడంతో పర్యాటకులు ఈ జర్నీపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు . రైలు పునః ప్రారంభమైందని తెలుసుకున్న సందర్శకులు చాలామంది… ఈ రైలెక్కి అరకుకు ప్రయాణమయ్యారు. ఎత్తైన కొండలు, లోయలు, వాగులు దాటుకుంటూ సాగే ఈ రైలు ప్రయాణం అనుభూతే వేరు. రోడ్డు మార్గమున్నా.. రైలు మార్గంలోనే అరకు వెళ్ళేందుకు జనం ఇష్టపడతారు. కోవిడ్‌ కారణంగా అరకు సుందర ప్రకృతి అందాలకు దూరమైన పర్యాటకులు.. రైలు కూతపెట్టిందని సంగతి తెలుసుకుని క్యూ కట్టారు. ఛలో అరకు అంటూ.. రైలెక్కి ప్రయాణమయ్యారు.

Post a Comment

0Comments

Post a Comment (0)