ఆన్ లైన్ లోనే డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 31 July 2021

ఆన్ లైన్ లోనే డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్


ప్రభుత్వ కొత్త నిబంధనల ప్రకారం, డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి ఆర్ టి ఓ  ఆఫీస్ వద్దకు వెళ్లి డ్రైవింగ్ టెస్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం దీని కోసం సులువైన కొత్త పద్దతిని తీసుకొచ్చింది. ప్రభుత్వం తీసుకోచ్చిన కొత్త నియమాల ప్రకారం, మీరు ఏదైనా గుర్తింపు పొందిన డ్రైవింగ్ స్కూల్ నుండి డ్రైవింగ్ లైసెన్స్ కోసం నమోదు చేసుకోవచ్చు. లెర్నర్స్ తమ లైసెన్స్ కోసం అర్హత సాధించడానికి ఏదైనా గుర్తింపు పొందిన డ్రైవింగ్ స్కూల్ కేంద్రాలలో శిక్షణ పొందాలి. మీరు ఈ కేంద్రాలలో డ్రైవింగ్ టెస్ట్ విజయవంతంగా ఉత్తీర్ణత సాధించగలిగితే, ప్రాంతీయ రవాణా కార్యాలయం (ఆర్టీఓ) వద్ద డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి డ్రైవింగ్ టెస్ట్ నుండి మీకు మినహాయింపు ఉంటుంది.

ఆర్టీఓవద్ద ఫిజికల్ టెస్ట్ కి బదులుగా, ఆన్లైన్ టెస్ట్ కోసం హాజరుకావాలి, ఆన్లైన్ టెస్ట్ ఆడిట్ కోసం ఎలక్ట్రానికల్ గా రికార్డ్ చేయబడుతుంది, భారతీయ రహదారి రంగంలో మంచి డ్రైవర్ల కొరత కారణంగా కొత్త నిబంధనలు అమలు చేయబడ్డాయి, డ్రైవింగ్ లైసెన్సుల జారీ ప్రక్రియలో లొసుగులను తగ్గించడానికి దరఖాస్తుదారుల ఆన్లైన్ పరీక్ష అమలు చేయబడుతోంది, ఆన్లైన్ డ్రైవింగ్ ఫిజికల్ డ్రైవింగ్ టెస్ట్ కంటే సమర్థవంతంగా ఉంటుందని భావిస్తున్నారు, డిజిటలైజేషన్ ప్రక్రియను మరింత పారదర్శకంగా మరియు సమర్థవంతంగా చేస్తుంది, డ్రైవింగ్ శిక్షణా కేంద్రాలు సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత, అది ఆటొమ్యాటిగ్గా సంబంధిత మోటారు వాహన లైసెన్స్ అధికారికి చేరుకుంటుంది. 

No comments:

Post a Comment