సుమంత్‌ పెళ్లి కార్డు వైరల్‌

Telugu Lo Computer
0


హీరో సుమంత్‌ త్వరలోనే రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు. తన కుటుంబానికి అత్యంత సన్నిహితురాలైన పవిత్ర అనే యువతి పెళ్లాడబోతున్నారట. ఇప్పటికే పెళ్లి పనులు కూడా మొదలు పెట్టి, వెడ్డింగ్‌ కార్డులు కూడా పంచినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సుమంత్‌-పవిత్రలకు సంబంధించిన ఓ పెళ్లి కార్డు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఈ పెళ్లి కార్డులను SP (సుమంత్‌-పవిత్ర) అనే అక్షరాలను హైలైట్‌ చేశారు.  సుమంత్ పెళ్లి ఎప్పుడు, ఎక్కడ అనేది మాత్రం తెలియరాలేదు. అయితే త్వరలోనే సుమంత్ మీడియా ముఖంగా తన పెళ్లి గురించి అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది. సుమంత్‌కు హీరోయిన్‌ కీర్తిరెడ్డితో గతంలోనే వివాహమైన విషయం తెలిసిందే. కొన్నేళ్ల పాటు వారిద్దరి దాంపత్య జీవితం కొనసాగింది. వ్యక్తిగత విభేదాలు రావడంతో సుమంత్, కీర్తీ రెడ్డి విడిపోయారు. ఆ తర్వాత కీర్తీ రెడ్డి రెండో వివాహం చేసుకొని బెంగళూరులో స్థిరపడ్డారు.

Post a Comment

0Comments

Post a Comment (0)