ఏడాది కోటి ఎలక్ట్రిక్ బైక్స్‌

Telugu Lo Computer
0

తమిళనాడులో 500 ఎకరాల్లో 'ఫ్యూచర్‌ ఫ్యాక్టరీ' పేరుతో ఓలా నిర్మిస్తున్న అతిపెద్ద ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహన తయారీ కేంద్రం త్వరలోనే కార్యకలాపాలు ప్రారంభించనుంది. ఈ కేంద్రం ఏటా కోటి వాహనాలను తయారు చేసే సామర్థ్యంతో ఉంటుంది. దీన్ని అంతర్జాతీయ తయారీ కేంద్రంగా ఓలా ఎలక్ట్రిక్‌ పరిగణిస్తోంది. 'ఓలా, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా మధ్య కుదిరిన దీర్ఘకాల రుణ ఒప్పందం.. ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ ప్లాంట్‌ను రికార్డు సమయంలోనే ఏర్పాటు చేయాలన్న మా ప్రణాళికల పట్ల రుణ దాతల్లో నమ్మకానికి నిదర్శనం. ప్రపంచానికి మేడిన్‌ ఇండియా ఎలక్ట్రిక్‌ వాహనాలను అందించాలన్న ప్రణాళికకు కట్టుబడ్డాం' అని ఓలా చైర్మన్, గ్రూపు సీఈవో భవీష్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)