ఎస్‌ ఆర్‌ కల్యాణమండపం

Telugu Lo Computer
0

 


యంగ్‌ హీరో కిరణ్‌ అబ్బవరం నటించిన తొలి చిత్రం 'ఎస్‌ ఆర్‌ కల్యాణమండపం'. ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికే హిట్‌ టాక్‌ అందుకున్నాయి. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ని చిత్రయూనిట్‌ విడుదల చేసింది. ట్రైలర్‌ కూడా.. సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. ఈ ట్రైలర్‌లో తండ్రిగా సాయికుమార్‌ నటన, చెప్పే డైలాగ్‌లు ఆకట్టుకుంటున్నాయి. ఇక హీరో కిరణ్‌ కూడా మాస్‌ హీరో ఇమేజ్‌ను సంపాదించుకునేలా ప్రయత్నిస్తున్నాడని అతని నటనలో అర్థమవుతోంది. ఇందులో హీరోకి జోడీగా 'టాక్సీవాలా' ఫేం ప్రియాంక జవాల్కర్‌ నటించించారు. ఈ మూవీని శ్రీధర్‌ గాదే దర్శకత్వం వహించగాఎలైట్‌ ఎంటర్టైన్మెంట్స్‌ బ్యానర్‌పై నిర్మించారు. ఆగస్టు 6న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)