అటల్ పెన్షన్ యోజన - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 29 July 2021

అటల్ పెన్షన్ యోజన


పేద ప్రజల అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టింది. వీటిలో ఒకటి అటల్ పెన్షన్ యోజన(ఏపీవై). సంఘటిత రంగంలోని పేద ప్రజలకు భద్రత కల్పించాలనే ఉద్దేశంతో ఈ పథకం తీసుకొచ్చారు. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్ మెంట్ అథారిటీ (పీఎఫ్‌ఆర్‌డీఏ) ద్వారా అటల్ పెన్షన్ యోజన నడుస్తుంది. ఈ పథకంలో చేరేందుకు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు కలిగిన భారతీయులు అర్హులు. దీని ద్వారా ప్రతి నెల కొంత మొత్తంలో నగదు జమచేస్తే.. 60 ఏళ్ళు దాటిన తర్వాత నెల నెల పెన్షన్ రూపంలో అందించడం జరుగుతుంది. వ్యక్తి అరవై ఏళ్ళు వచ్చేవరకు కనీసం 240 నెలలు కొంత మొత్తం పొదుపు చేయాల్సి ఉంటుంది. పోగుచేసిన డబ్బు 60 ఏళ్ల తర్వాత పెన్షన్ రూపంలో తిరిగి చెల్లించడం జరుగుతుంది. నెలకు రూ.1000 నుంచి రూ.5000 వేల వరకు పెన్షన్ పొందవచ్చు.  భార్యాభర్తలు ఉమ్మడిగా కూడా నగదు జమచేయవచు. ఎందుకు బ్యాంకు అకౌంట్ లేదంటే పోస్టాఫీసు ఖాతా ఉంటే సరిపోతుంది. వయసును బట్టి పొదుపు చెయ్యాల్సిన మొత్తం మారుతుంటుంది. 18 ఏళ్ల వయసున్నవారు నెలకు రూ.210 జమచేస్తే సరిపోతుంది. 39 సంవత్సరాల వయసుగలవారు నెలకు రూ.577 చెల్లించాల్సి ఉంటుంది. ఇక 39 ఏళ్ల జంట (దంపతులు) ఈ స్కీమ్ లో చేరితే ఇద్దరికి కలిపి రూ.1154 జమ చేయాలి. అంటే రోజుకు రూ.38.46 జమచేయాల్సి ఉంటుంది. ఇలా 20 ఏళ్లపాటు జమచేసిన జంటకు నెలకు రూ.10,000 పెన్షన్ వస్తుంది. 35 ఏళ్ల వారు నెలకు రూ.902 రూపాయలు జమచేసుకోవాలి. ఇలా 20 ఏళ్ళు చేసిన వారికి 60 ఏళ్ళు దాటిన తర్వాత నెల నెల పెన్షన్ వస్తుంది. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2015 మేలో ప్రారంభించింది.

No comments:

Post a Comment