నోరు మెదపరెందుకు?

Telugu Lo Computer
0

కేంద్రం సినిమాటోగ్రఫీ చట్టం1952లో సవరణలు చేసి, తెచ్చిన కొత్త చట్టంపై తమిళ, బాలీవుడ్  సినీ పరిశ్రమ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా  మన తెలుగు చిత్రసీమలో ఎవరూ దీనిపై నోరు మెదపడం లేదు. పెద్ద తలకాయలు మౌనం వహించడం చాలా సందర్భాల్లో లాగానే ఇప్పుడూ కొనసాగుతోంది. ఇది శోచనీయం.  
* ఈ చట్టం ప్రకారం సినిమాలో సీన్ల కత్తెర సెన్సార్ బోర్డు కాకుండా పెత్తనం కేంద్రం దగ్గర ఉంటుంది. 'కష్టం ఇండస్ట్రీ - పెత్తనం  కేంద్రం. 
* ప్రజలను ఆలోచింపజేసే విధంగా, జనం ప్రశ్నించేలా ఉన్న సినిమాలను చూసి రాజకీయ నాయకుల నిజస్వరూపాలు తెలుసుకుంటున్నారని కేంద్రం భయం.
*  తమ విధానాలకు వ్యతిరేకంగా ఉండే, లేదా తమకు నచ్చని అంటే   గతంలో తీసిన విప్లవ భావాలూ, ప్రభుత్వాలను ప్రశ్నించే సినిమాలు ఇక  కనబడవు.. వాక్ స్వాతంత్ర్యం, భావప్రకటన స్వేచ్ఛ కు భంగం కలుగుతుంది..
-

Post a Comment

0Comments

Post a Comment (0)