అధ్యక్ష పదవి హోదా మాత్రమే!

Telugu Lo Computer
0


గతంలో మా సభ్యులు  తక్కువ మంది  ఉండేవారని అప్పట్లో పద్ధతిగా ఉండేదని, ప్రస్తుతం ఎవరికి పడితే వారికి మా సభ్యత్వం దక్కుతోందని మురళీ మోహన్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఎవరు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబరో, ఎవరు కాదో తెలిసే పరిస్థితి లేదని పాత రోజులు మళ్లీ వస్తే బాగుంటుందని అన్నారు.  గాడి తప్పిన ‘మా’ను సరైన ట్రాక్ లో పెట్టే ప్రయత్నం చేస్తున్నామని ఎన్నికలు లేకుండా ఏకగ్రీవంగా అధ్యక్షుడిని ఎంపిక చేసి మంచి కమిటీని ఏర్పాటు చేయాలని చూస్తున్నామని మురళీ మోహన్ చెప్పుకొచ్చారు. ‘మా’లో కొన్ని విధానాలు మారాలని మురళీ మోహన్ అభిప్రాయపడ్డారు. తాను, చిరంజీవి, మోహన్ బాబు, జయసుధ, కృష్ణంరాజు  సిట్టింగ్ లు జరిపి ‘మా’ను గాడిన పెట్టే ప్రయత్నం చేస్తున్నామన్నారు అందరినీ ఒప్పించి ఏకగ్రీవం చేస్తామని మురళీ మోహన్ వెల్లడించారు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకొని  ‘మా’ను కుక్కలు చింపిన విస్తరి చేయొద్దని మురళీ మోహన్ హితవు పలికారు. ‘మా’ అధ్యక్ష పదవి అంటే హోదా మాత్రమేనని దాని వల్ల వచ్చేది ఏం ఉండదని మురళీ మోహన్ అభిప్రాయపడ్డారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)