సమియాదీల నరభక్షణ ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 27 July 2021

సమియాదీల నరభక్షణ !

 


తమిళనాడులో టెంకాశి జిల్లా కల్లురానీ గ్రామంలోని శక్తి పోతి సుడలై మదసామి ఆలయం (కట్టు కోవిల్)లో జరిగిన వేడుకలో పాల్గొన్న కొందరు సమియాదీలు మానవ పుర్రె చేతిలో పట్టుకుని పాటలు పాడుతూ వికృత నృత్యాలు చేశారు. అంతేకాక ప్రజల ముందే నరమాంసాన్ని తింటూ పూనకం వచ్చినవాళ్లలాగా ఊగిపోయారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్​గా మారాయి. దీంతో విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా 10మంది మియాదీలు, ఆలయ కమిటీ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు. తినడం కోసం వారు ఎవరి శరీరాన్ని వెలికి తీశారో తెలుసుకోవటానికి కొందరు సమియాదీలను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, ఈ సంఘటన జరిగినప్పుడు తాము ట్రాన్స్ లోకి వెళ్ళామని మరియు ఆలయ దేవత తమలోకి ప్రవేశించదని సమియాదీలు చెబుతూ ఉండటంతో ఆ మృతదేహం ఎప్పుడు, ఎక్కడ నుంచి వెలికి తీయబడిందనే దానిపై పోలీసులకు ఇంకా ఆచూకీ లభించలేదు. కాగా, సగం కాలిపోయిన మానవ మృతదేహాన్ని ఏదైనా గ్రామ శ్మశానవాటిక నుండి తీసుకువచ్చారా అనే కోణంలో కూడా విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

కాగా 2019లో కూడా ఇదే కట్టు కోవిల్ ఆలయానికి చెందిన 'సమియాదీలు' పండుగ సందర్భంగా తెలియని ప్రదేశం నుండి వెలికి తీసిన మానవ పుర్రె మరియు చేతిని తీసుకువచ్చారు. ఆ దృశ్యాలు కూడా అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే టెంకాసీ జిల్లాలోని ఇతర సుడలై మదసామి దేవాలయాల సమియాదీలు..ఆలయ పండుగ సమయంలో మృతదేహాల వేటలో భాగంగా రాత్రిపూట శ్మశాన వాటికలకు వెళతారని..ఇదొక మతపరమైన ఆచారంగా వారు భావిస్తారని సమాచారం.

No comments:

Post a Comment