స్కానింగ్ మెషిన్ లో ఇరుక్కున్న చెయ్యి

Telugu Lo Computer
0



ముంబైకి చెందిన విక్రమ్ అబ్ నవే అంబులెన్స్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. శుక్రవారం ఓ పేషెంట్ ను ఎమ్ఆర్ఐ స్కానింగ్ నిమిత్తం ప్రతామ్‌ ఎమ్‌ఆర్‌ఐ అండ్‌ సీటీ స్కాన్‌ సెంటర్‌కు తీసుకుని వెళ్లాడు. అయితే రోగి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆక్సిజన్ ఉంచి ఎమ్ఆర్ఐ స్కానింగ్ మెషీన్‌ ఉన్న రూమ్ లోకి తీసుకెళ్లారు. పేషెంట్ తోపాటు ఆక్సిజన్ సిలెండర్ ను విక్రమ్ లోపలికి తీసుకెళ్లాడు. అదే సమయంలో అతడికి షాక్ కొట్టినట్టు అనిపించింది. ఆ షాక్ నుంచి తేరుకునేలోపే ఎమ్ఆర్ఐ మెషీన్‌ లో ప్రమాదవశాత్తు విక్రమ్‌ చేయి ఇరుక్కుంది. ఓ చేతిలో ఆక్సిజన్‌ సిలిండర్‌ ఉండగా,  మరో చేయి ఎమ్‌ఆర్‌ఐలోకి వెళ్లిపోయింది. అతడు తన చేతిని గట్టిగా వెనక్కిలాగాడు. ఈ ప్రమాదంలో అతని చేతికి తీవ్ర గాయమై రక్తం కారింది. అతని చిటికెనవేలు విరిగిపోవడంతో రాడ్ వేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)