ఇంట్లోనే ముత్యాలు సాగు

Telugu Lo Computer
0


కేరళకు చెందిన మతాచన్ సాధారణ రైతు కుటుంబంలో పుట్టి,  ఉన్నత చదువుల చదువి  సౌదీ అరేబియాలోని ధారన్ లో గల కింగ్ ఫాధ్ పెట్రోలియం అండ్ మినరల్ యూనివర్శిటీలో టెలికమ్యునికేషన్స్ డిపార్టుమెంట్ లో ఫ్రొఫెసర్ గా పని చేస్తున్నాడు. ఆ సమయంలో యూనివర్సిటీ పని మీద చైనాకు వెళ్ళాల్సి వచ్చింది. చైనాలోని ధనుష్షీ ఫిషరీస్ రీసర్చి సెంటర్ లో పలు కోర్సులు నేర్చుకోవాలన్న ఆసక్తి కలిగింది. వెంటనే ముత్యాల సాగులో డిప్లొమా కోర్సులో చేరాడు. ప్రొఫెసర్ ఉద్యోగానికి రాజీనామా చేసి 1999లో తిరిగి కేరళకు చేరుకున్న మతాచన్ తన ఇంటి పెరట్లోనే ముత్యాల సాగు మొదలు పెట్టాడు. నదులలో దొరికే ఆల్చిప్పటలను తెచ్చి 18 నెలలు బకెట్లో వాటిని ఉంచి ముత్యాలను ఉత్పత్తి చేస్తాడు. ఈ 18 నెలల కాలంలో 50 బక్కెట్ల ముత్యాలను ఉత్పత్తి చేయటం ద్వారా రూ.4.5లక్షల సంపాదిస్తాడు. గత 20 సంవత్సరాలుగా ఇదే పని చేస్తున్నాడు. ఉత్పత్తి చేసిన ముత్యాలలో ఎక్కువ భాగాన్ని అస్ట్రేలియా, సౌదీ అరేబియా, కువైట్, స్విట్జర్లాండ్ తదితర ప్రాంతాలకు ఎగుమతి అవుతున్నాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)