ప్రాప్తం

Telugu Lo Computer
0


బలమైన ఆర్థిక వనరులు లేకపోవడం వల్ల. సుబ్బారావు భార్య పోయాక కొడుకులు దగ్గరకు చేరాడు. ఆరు నెలలు ఓ కొడుకు దగ్గర, ఆరునెలలు మరో కొడుకు దగ్గర ఉండవలసిన పరిస్థితి. పాపం సుబ్బారావు కి ఆ కాకర కాయలంటే ఇష్టం.ఎన్నిసార్లు అడిగినా కొడుకులు తెచ్చే వారు కారు. ఒకో సారి ఈయనే తెచ్చినా వండటం రాక కోడళ్ళు వండే వారు కారు. గత ఐదేళ్ళు గా ఇదే పరిస్థితి.

ఓ రోజు సుబ్బారావు  సిస్టర్ అన్నగారిని చూడటానికి వస్తూ,అన్నగారి కిష్టమైన ఆకాకర కాయలు తీసుకుని వచ్చింది.

సుబ్బారావు కోడల్ని పిలిచి ఈ రోజు వంట మా చెల్లెలు చేస్తుంది అమ్మా నువ్వు కాస్త విశ్రాంతి తీసుకో అని

చెల్లెలు తో అమ్మలూ కాకర కాయలు ‌వేయించి,చక్కగా ఇంగువ‌ తిరగ మోత పెట్టి పెసరపప్పు పప్పు చారు పెట్టు అని చెప్పాడు.

సరే కోడలు తో కబుర్లు చెబుతూ

సుబ్బారావు చెల్లెలు వంటగదిలో వంటపనిలో నిమగ్నమై పోయింది. ఫలహారాలు పూర్తయినా క, సుబ్బారావు తన గదిలోకి పోయి మందులు వేసుకుని పడుకున్నాడు మధ్యాహ్నం తినబోయే ఆ కాకర కాయ వేపుడు, పప్పు పులుసు గురించి  తలుచుకుంటూ.

మధ్యాహ్నం 12 అయ్యింది.

మావయ్య గారూ,భోజనం రెడీ రండి అంటూ కోడలు పిలిచింది.చెల్లెలు కూడా పిలిచింది.నాలుగైదు‌సార్లు పిలిచినా పలక్క పోతే గదిలో కొచ్చి పిలిచారు.ఎక్కడా ఉలుకు పలుకూ లేక పోయేడప్పడికి  దగ్గరే ఉన్న డాక్టర్  పిలిచారు.

డాక్టర్ గారు వచ్చి చూసి ప్ఛ్ సోరీ అమ్మా ఈయన పోయి అప్పుడే అరగంట పైనయింది అన్నాడు. విషయం విని‌ ఆఘమేఘాలమీద కొడుకు పరుగెత్తుకొచ్చాడు.పాపం సుబ్బారావు తనకి ఇష్టమైనఆ కాకర కాయ వేపుడు తినకుండా నే పోయాడు.

కొడుకులు ఉత్తర క్రియలు శ్రద్ధగా నే చేశారు. 

తండ్రికి ఇష్టమని భోక్తలకి ఆకాకర కాయల వేపుడు కూడా వడ్డించారు.

ఓ భోక్త అమ్మా! ఈ ఆకాకర కాయ వేపుడు తీసేయండి నేను‌ కాశీలో వదిలేశాను అన్నాడు.

మరో భోక్త ఏ కారణం చేతనో‌ఆ వేపుడు ముట్టుకోలేదు.

పాపం సుబ్బారావు కి ఇహంలో, పరంలోను కూడా

ఆ కాకర కాయలు ప్రాప్తం లేనట్టుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)