వివేకానందుని ఉవాచ...!

Telugu Lo Computer
0


నా గురుదేవుడు రామకృష్ణ పరమహంస శాకాహారి, కాని కాళికాదేవికి నివేదించబడిన మాంసం ఆయనకు పెడితే కళ్ళ కద్దుకుని తినేవారు. జీవహింస నిస్సందేహముగా పాపమే. కాని రసాయన శాస్త్రాభివృద్ధి మూలంగా మానవ శరీరానికి సరిపడేటంత శాకాహారం సంస్కరించబడే వరకూ మాంసాహారం కన్నా గత్యంతరం లేదు. మరణ దండన శాసనంతో అశోక చక్రవర్తి, ప్రజల్ని భయపెట్టి లక్షల కొద్దీ జంతువుల ప్రాణాలు కాపాడాడన్నమాట నిజమే కానీ, వెయ్యి సంవత్సరాల బానిసత్వం అంతకన్నా ఘోరం కాదా? కొన్ని జంతువుల ప్రాణాలు తీయడం - లేక భార్యా బిడ్డల ప్రాణాలను రక్షించుకొనలేక పోవడమూ - వీటిలో ఏది ఎక్కువ పాపకరమైనది. కాయకష్టం వలన జీవనోపాధిని ఆర్జించుకోని అగ్రకులస్తుల మాంసాహారాన్ని తినకుందురు గాక! కానీ రాత్రింపగళ్ళు కష్టించి పనిచేసి తిండిని సంపాదించుకొనవలసిన వారిని బలవంతంగా శాకాహారులను చేయడం మన స్వాతంత్ర్య నాశనానికి గల ముఖ్య కారణాలలో ఒకటి.

Post a Comment

0Comments

Post a Comment (0)