మత్స్యకారులు వేటకు వెళ్లొద్దు..!

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ పరిస్థితులకు సంబంధించి రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ  సూచనల ప్రకారం పశ్చిమమధ్య, వాయువ్య బంగాళాఖాతం, ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరప్రాంతంలో ఆదివారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.  ఆదివారం, సోమవారాల్లో  అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయన్నారు. అల్పపీడనం ప్రభావంతో తీరం వెంబడి గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులెవరూ మంగళవారం వరకు సముద్రంలోకి వేటకు వెళ్లరాదంటూ హెచ్చరికలు జారీ చేశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)