సముద్ర గర్భంలో శివాలయం !

Telugu Lo Computer
0

 

గుజరాత్ లోని బావ్ నగర్ సమీపానికి వున్న కొలియక్ అనే గ్రామంలో సముద్రం నుండి ఒకటిన్నర కిలోమీటర్ల లోపల వుంది ఈ దేవాలయం. ఇక్కడున్న ఆలయంలో శివుడు వుంటాడు. ఇందులో శివలింగం వుంటుంది.  రోజులో కొన్ని గంటలు మాత్రమే ఈ గుడిని చూడవచ్చు. మిగతా సమయమంతా ఈ గుడి సముద్రంలో మునిగి ఉంటుంది.

ఈ ఆలయం పేరు నిష్కలంక్ శివాలయం. గుజరాత్ లో అరేబియా సముద్రం తీరం వెంబడి ఒకటిన్నర కిలోమీటర్ల లోపలికి ఒక గడ్డమీద నిష్కళంక మహదేవుడు వెలసివున్నాడు. ఉదయం సాయంత్రాల్లో అలలు తగ్గినప్పుడు కొన్ని గంటల సేపు మాత్రమే మనం నిష్కళంకుని దర్శించుకోవచ్చు. 

పురాణాల ప్రకారం పాండవులు ఇక్కడ నిష్కలంక్ మహాదేవ్ ఆలయాన్ని స్థాపించినట్లుగా చెబుతారు ఈ కొలియాక్ తూర్పు సముద్ర తీరానికి 3 కిలోమీటర్ల దూరంలో  ఆలయం ఉంటుంది. అయితే ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే ఈ ఆలయం సముద్ర తీరాన కాకుండా  సముద్రం లోపల ఉంటుంది.  పాండవులు తమ దోషాలను, కళంకాలను పొగోట్టుకోవడానికి ఈ ఆలయాన్ని నిర్మించారని, అందుకే ఈ  శివాలయానికి నిష్కలంక్ అని పేరు పెట్టినట్లుగా పురాణాల్లో ఉంది. ఉదయం  ఈ ఆలయం పూర్తిగా నీటమునిగి ఉంటుంది. సముద్రం మధ్యలో ఆలయం ఉంది అనడానికి గుర్తుగా అక్కడ ఒక ధ్వజస్తంభంపై జెండా ఉంటుంది. ఇక మధ్యాహ్నం 11 గంటలు దాటిన తర్వాత నుంచి మెల్లగా సముద్రం వెనక్కి వెళ్తుతుంది. దీంతో ఆలయానికి వెళ్లే మార్గం కనిపిస్తుంది. తిరిగి అర్థరాత్రి సమయానికి మళ్లీ సముద్ర గర్భంలోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ పౌర్ణమి అమావాస్య రోజులలో భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు.  ఇక ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజున ఇక్కడ అత్యంత వైభవంగా ఉత్సవాలు జరుగుతుంటాయి. సముద్రం మధ్యలో శివాలయం ఎలా నిర్మించారనే విషయం మాత్రం ఇప్పటికీ అంటూ చిక్కని రహస్యంగా ఉంది.  

Post a Comment

0Comments

Post a Comment (0)