సబ్సిడీ ట్రాక్టర్ల పేరుతో మోసం

Telugu Lo Computer
0

 


ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమల మండలం వెంకటకృష్ణాపురం గ్రామానికి చెందిన శ్రీధర్ తనకు బ్యాంకు ఉద్యోగులు, ట్రాక్టర్ షోరూమ్ యజమానులు బాగా తెలుసునని ఏడాది క్రితం అదే గ్రామానికి చెందిన రైతులను నమ్మించారు. ఆరు లక్షల రూపాయల ట్రాక్టర్  సబ్సిడీలో 4 లక్షల రూపాయలకే వస్తుందని రైతులు నమ్మించారు. సుమారు 35 మంది రైతుల వద్ద నుంచి ట్రాక్టర్ల కొనుగోలుకు కావాల్సిన సంతకాలు డాక్యుమెంట్లు సేకరించారు. 2 లక్షల రూపాయల సబ్సిడీ వస్తుందని నమ్మిన రైతులు కావాల్సిన డాక్యుమెంట్లు శ్రీధర్‌కు ఇచ్చారు. రైతుల వద్ద నుంచి సంతకాలు తీసుకున్న శ్రీధర్ ట్రాక్టర్ షోరూమ్ యజమాని, సేల్స్ ఎగ్జిక్యూటివ్‌తో కుమ్మకై  ఒక ట్రాక్టర్ వద్ద రైతులను ఉంచి, ఫోటోలు తీసి, టాక్టర్లను ఇచ్చినట్లు చూపి ఫైనాన్స్ కంపెనీల వద్ద రైతుల పేరు మీద ట్రాక్టర్లు కొనుగోలు చేశారు. ఆ కొనుగోలు చేసిన ట్రాక్టర్లను తక్కువ ధరలకు పశ్చిమగోదావరి జిల్లా, తెలంగాణ రాష్ట్రానికి చెందిన కొందరు వ్యక్తులకు అమ్మేశారు. అయితే ట్రాక్టర్ల వాయిదాలు కట్టకపోతే రైతులకు అనుమానం వస్తుందని మూడు నెలలకు ఒకసారి రైతుల అకౌంట్లో తన అకౌంట్ నుంచి డబ్బులు పంపి ఫైనాన్స్ కంపెనీలకు వెళ్లే విధంగా ఏర్పాటు చేశారు. కొంతకాలం గడిచిన తర్వాత శ్రీధర్ వాయిదాల కట్టడం మానేశారు. ట్రాక్టర్లు వస్తాయని ఎదురు చూస్తున్న రైతులకు ఒక్కసారిగా షాక్ తగిలింది. వాయిదాలు కట్టకపోవడంతో ఫైనాన్స్ కంపెనీలు  రైతుల పేరు మీద  నోటీసులు పంపారు. దీంతో శ్రీధర్ తమను మోసం చేశాడని గుర్తించిన రైతులు ద్వారకాతిరుమల పోలీసులను ఆశ్రయించారు. రైతుల ఫిర్యాదుతో పోలీసులు ట్రాక్టర్ల స్కాంలో ప్రధాన సూత్రధారి శ్రీధర్‌తో పాటు ట్రాక్టర్ షోరూమ్ యజమాని మనోజ్ కుమార్, సేల్స్ ఎగ్జిక్యూటివ్ మోహన్ కుమార్‌పై చీటింగ్ కేసులు నమోదు చేసి వారిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైతుల పేరుతో కొనుగోలు చేసిన 5 ట్రాక్టర్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)