ఎనిమిది రాష్ట్రాలకు కేంద్రం లేఖ

Telugu Lo Computer
0


ఎనిమిది రాష్ట్రాల్లో కరోనా కేసుల నమోదు చూస్తుంటే ఆందోళనకరంగా వున్న దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం  రాష్ట్రాలకు లేఖలు రాసింది. కరోనా కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాలని, వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని, కరోనా నిబంధనల్ని పాటించేలా కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషన్ అరుణాచల్ ప్రదేశ్, అసోం, మణిపూర్, కేరళ, మేఘాలయ, ఒడిశా, త్రిపుర, సిక్కిం  రాష్ట్రాల అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ లేఖలు రాశారు.  కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ మాట్లాడుతూ దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ ముందస్తు హెచ్చరికలు పాటించాలన్నారు. కరోనా వైరస్ నియంత్రణకు సామూహిక ప్రయత్నాలు అత్యవసరమని స్పష్టం చేశారు. అరుణాచల్‌ప్రదేశ్‌లోని 25 జిల్లాల్లో కరోనా వ్యాప్తి రేటు అత్యధికంగా 19 శాతం ఉన్నా..పాజిటివిటీ రేటును 10 శాతానికిపైగా ఉందని..ఇది ఆందోళన కలిగించే అంశమని అన్నారు. వారానికి 12 శాతం కొత్త కేసులు నమోదు అవుతున్నాయని దీంతో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)