తెతెపా అధ్యక్ష పదవికి రాజీనామా - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Looking For Anything Specific?

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

ad

Friday, 9 July 2021

తెతెపా అధ్యక్ష పదవికి రాజీనామా


తెలుగుదేశం తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఎల్.రమణ తన రాజీనామా లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు పంపించారు. ఆయన తన రాజీనామా లేఖను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశారు. తన ఎదుగుదలకు గత 30 ఏళ్లుగా తోడ్పాటు అందించిన నారా చంద్రబాబు నాయుడుకు ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఎల్.రమణ గురువారం ప్రగతి భవన్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. ఇద్దరి మధ్యా దాదాపు గంటన్నరకు పైగా చర్చలు జరిగాయి. తర్వాత ఎర్రబెల్లి దయాకరరావుతో కలిసి మీడియాతో మాట్లాడిన రమణ జగిత్యాలకు వైద్య కళాశాల ఇచ్చినందుకు కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపానని చెప్పారు. రాష్ట్రాభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై సీఎంతో చర్చించానని, రాష్ట్రంలోని అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమానికి ముఖ్యమంత్రి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని ఆయన్ను కొనియాడారు.No comments:

Post a Comment

Post Top Ad