సామెతలు....!

Telugu Lo Computer
0

 

* వేపకాయంత వెర్రి !

* వచ్చీరాని మాటలు రుచీ, ఊరీ ఊరని ఊరగాయ రుచీ !

* వస్తే కొండ పోతే వెంట్రుక!

* వడ్డించే వాడు మనవాడైతే చివరి బంతిలో కూర్చున్నా ఫరవాలేదు !

* వసుదేవుడంతటివాడు గాడిద కాళ్లు పట్టుకున్నట్లు !

* విదియ నాడు కాకపోతే తదియ నాడైనా కనపడక తప్పదు !

* వినేవాడు వెధవ అయితె పంది కూడా పురాణం చెపుతుంది !

* వీపు విమానం మోత మోగుతుంది

* వెన్న తిన్నవాడు వెళ్ళిపోతే చల్ల దాగిన వాడిని చావ మోదినట్టు !

* వేగం కన్నా ప్ర్రాణం మిన్న

* వేన్నీళ్ళకి చన్నీళ్ళు తోడు !

* వాడికి సిగ్గు నరమే లేదు !

* విగ్రహపుష్టి నైవేద్యనష్టి !

* వియ్యానికైనా కయ్యానికైనా సమ ఉజ్జీ ఉండాలి !

* వంకరటింకర పోతుంది పాము కాదు !

Post a Comment

0Comments

Post a Comment (0)