ఉచిత ల్యాప్‌టాప్‌ల ఉత్తర్వులు జారీ

Telugu Lo Computer
0


అమ్మ ఒడి పథకం కింద ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెల్సిందే. 9, 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ల్యాప్ టాప్ లు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం నిర్ణయించింది. అమ్మఒడి పథకం కింద ఇస్తున్న నగదును వద్దనుకున్న వారికి ల్యాప్ టాప్ లు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ల్యాప్‌టాప్‌ల పంపిణీకి సంబంధించి పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్‌ ఈ ఉత్తర్వులు జారీ చేసారు. డ్యుయెల్‌ కోర్‌ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 500 జీబీ హార్డ్‌ డిస్క్, 14 ఇంచ్‌ల స్క్రీన్, విండోస్‌ 10 (ఎస్టీఎఫ్‌ మైక్రోసాఫ్ట్‌), ఓపెన్‌ ఆఫీస్‌ (ఎక్సెల్, వర్డ్, పవర్‌ పాయింట్‌)ల కాన్ఫిగరేషన్‌తో ల్యాప్‌టాప్‌లు అందించనున్నారు. ల్యాప్‌టాప్‌లకు మూడేళ్ల వారెంటీ ఉండాలని పేర్కొంటూ టెండర్లు పిలిచే బాధ్యతను ఏపీటీఎస్ కు అప్పగించనున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)