సరికొత్త ఫీచర్లతో గూగుల్ మీట్

Telugu Lo Computer
0


తమ వినియోగదారులకు మరిన్ని మెరుగైన సేవలు అందించేందుకు గూగుల్ మీట్ లో మరికొన్ని ఫీచర్లను యాడ్ చేసింది. కొత్త ఆప్షన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది గూగుల్. ప్రస్తుతం గూగుల్ మీట్ ద్వారా ఒకేసారి లక్షమంది సమావేశం జరుపుకోవచ్చు. గూగుల్ మీట్‌ను హోస్ట్ చేసిన వ్యక్తి మరో కొత్త డొమైన్ ద్వారా మరింత మందిని సమావేశానికి ఆహ్వానించే సౌకర్యం ఇప్పటిదాకా లేదు. గూగుల్ తాజాగా ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. లైవ్ స్ట్రీమ్ కొనసాగిస్తూనే, మరోపక్క గూగుల్ మీట్ హోస్ట్ కొత్త డొమైన్ ద్వారా మరింత మందిని ఈ సమావేశానికి ఆహ్వానించే వెసలుబాటును కల్పించింది. కొత్త ఫీచర్ల వల్ల క్రాస్ డొమైన్ లైవ్ స్ట్రీమింగ్ చేయడానికి వీలు ఉంటుంది. ఒక పేజీ  డొమైన్‌లో లైవ్ స్ట్రీమింగ్ కొనసాగుతోన్న సమయంలో అదే లైవ్ స్ట్రీమింగ్‌ను క్రాస్ డొమైన్ ద్వారా ప్రసారం చేసే అవకాశం ఉంది. దీనితో పాటు క్యాప్షన్స్‌ను కూడా యాడ్ చేసే వీలు ఉంటుంది. వినికిడి లోపం ఉన్న వారికి, సౌండ్‌ అలర్జీకి గురయ్యే వారికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ క్యాప్షన్లను యాడ్ చేసే విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. అలాగే ఆడియో ఆఫ్ చేసిన తరువాత కూడా ఆ సమావేశానికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవడానికి క్యాప్షన్ల సౌకర్యం దోహదపడుతుందని గూగుల్ యాజమాన్యం తెలిపింది.


Post a Comment

0Comments

Post a Comment (0)