"బీ పాజిటివ్"

Telugu Lo Computer
0


"డాక్టర్ గారు! నేను న్యూయార్క్ నుండి మాట్లాడుతున్నాను. రెండు నెలల క్రితం ఇండియా వచ్చినప్పుడు, కుడికాలి చిటికెన వేలు నొప్పి వస్తుందని మీ దగ్గరకు వచ్చాను. అప్పుడు మీరు టెస్టులు చేయించి, పెయిన్ కిల్లర్లు ఇచ్చి, ఏమీ పర్వాలేదు. పాజిటివ్ గా ఉండండి అన్నారు కదా? కానీ ఇప్పుడు నొప్పి ఎక్కువ అయ్యి ఇక్కడ న్యూయార్క్ లో హాస్పిటల్ కు వెళితే ఇది క్యాన్సర్ అంటున్నారండి. రెండు నెలల ముందే వచ్చి ఉంటే, చిటికెన వేలుకి చిన్న సర్జరీ చేస్తే సరిపోయేది. ఇప్పుడు కుడికాలు మొత్తం తీసేయాలి అంటున్నారండి. అప్పుడే మీరెందుకు చెప్పలేదు?"

"అది క్యాన్సర్ అని నాకు అప్పుడే తెలుసు. కాకపోతే, మీ మాటల ఇన్స్పిరేషన్ తోనే ఆ విషయం చెప్పలేదు"

"ఏ మాటలు?"

"రామాయణంలో, బైబిల్లో లోపాలు తప్పులు వెతక్కూడదు. మంచిని మాత్రమే చూడాలి. ఏ సందర్భంలో అయినా పాజిటివ్ విషయాలను మాత్రమే చూస్తే లైఫ్ మొత్తం పాజిటివ్ గా ఉంటుంది, విమర్శలు ఎందుకు అనే వారుగా, అందుకే మీ ఒంటిలో ఆ చిటికెన వేలుకి ఉన్న కేన్సర్ తప్పించి, మిగిలిన భాగాలన్నీ ఆరోగ్యంగానే ఉన్నాయి కదా.  అందుకే చిన్న చిన్న లోపాల గురించి ఎందుకని పాజిటివ్ విషయాలు మాత్రమే మాట్లాడి, పాజిటివ్ గా ఉండండని చెప్పి పంపేశా"

"కానీ ఇప్పుడు కాలు మొత్తం తీసేస్తా అంటున్నారండి"

"కాలు అంటూ ఉంటే, వేలు బాలేదు, దాని గోరు బాలేదు అనే బాధ ఉంటుంది. మొత్తం కాలే తీసేశాక, వేలు గురించి చింతిచాల్సిన అవసరం ఉండదు. బీ పాజిటివ్ మై డియర్ బాయ్. బీ పాజిటివ్"

Post a Comment

0Comments

Post a Comment (0)