యూట్యూబ్​ ఛానల్ కు కోటిమంది .....!

Telugu Lo Computer
0



పెద్ద నెట్ వర్క్స్ జాతీయ స్థాయి ఛానెళ్లకు కూడా సాధ్యపడని ఓ అరుదైన రికార్డును ఓ రీజనల్ కుకింగ్ ఛానెల్ సొంతం చేసుకొని సంచలనం సృష్టిస్తుంది. విలేజి కుకింగ్ అనే ఓ యూట్యూబ్ ఛానెల్ మొదలుపెట్టిన మూడేళ్ళ కాలంలోనే ఏకంగా కోటి మంది సబ్ స్క్రైబర్లను సొంతం చేసుకొని అందరినీ షాక్ కి గురిచేస్తుంది. తమిళ భాషలో కుకింగ్ వీడియోలు చేసే ఈ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు దేశవ్యాప్తంగా పేరు మార్మ్రోగిపోతుంది. ఇప్పుడు చాలా మందికి ఇదో ఆదాయ వనరు. వారికి ఉన్న టాలెంట్.. నచ్చింది చేసి వీడియో పోస్ట్ చేస్తే.. కాస్త లక్ కూడా కలిసి వస్తే మీరే మహారాజు. కాస్త వేగంగా వ్యూస్, సబ్ స్క్రైబర్స్ వస్తుంటే యూట్యూబ్ కూడా వారి వీడియోలను పుష్ చేసి మరికాస్త ఊతమిస్తుంది. పెద్ద పెద్ద సెలబ్రిటీలు మొదలు ఇంట్లో ఉంటూ పిచ్చాపాటి కబుర్లు చెప్పుకొనే గృహిణుల వరకు అందరూ ఇప్పుడు యూట్యూబర్ గా ఒక ప్రయత్నం చేస్తున్నారు.  ఈ సంవత్సరం జనవరి నెలలో కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీ ఈ ఛానెల్ తో కలిసి వంట చేసి సహపంక్తి భోజనం చేశారు. ఆ వీడియో భారీ స్థాయి వ్యూస్ రాబట్టింది. అదే సమయంలో కోటిమంది సబ్ స్క్రైబర్లను రాబట్టడంలో కూడా ఈ వీడియోలు ఈ ఛానెల్ నిర్వాహాలకు పెద్ద ప్లస్ అయ్యింది. ఒక్కమాటలో చెప్పాలంటే రాహుల్ గాంధీ మీట్ తర్వాత ఈ ఛానల్ పేరు​ దేశంలో మారుమోగిపోయింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ చేసిన ఈ వీడియోలతో  మళ్ళీ వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది.

Post a Comment

0Comments

Post a Comment (0)