షావోమీ యానివర్సరీ సేల్

Telugu Lo Computer
0


షావోమీ ఎంఐ యానివర్సరీ సేల్ ప్రారంభించింది. ఇండియాలో అడుగు పెట్టి ఏడేళ్లు పూర్తైన సందర్భంగా 'Mi Turns 7' పేరుతో సేల్ ప్రారంభించింది. ఈ సేల్‌ జూలై 16న ముగుస్తుంది. షావోమీ ఇండియా వెబ్‌సైట్ మాత్రమే కాదు ఎంఐ హోమ్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఇతర రీటైల్ పార్ట్‌నర్స్ దగ్గర ఈ సేల్ ఉంటుంది. షావోమీ కంపెనీకి చెందిన అన్ని ప్రొడక్ట్స్‌పై డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్ టీవీలు, ఇతర ప్రొడక్ట్స్‌పై డిస్కౌంట్ ప్రకటించింది. ప్రతీ రోజు సాయంత్రం 4 గంటలకు స్పెషల్ సేల్ ఉంటుంది. ఈ సేల్‌లో తక్కువ ధరకే ప్రొడక్ట్స్ కొనొచ్చు. ఇక ప్రతీ రోజు ఉదయం 10 గంటలకు హాట్ డీల్స్ ఉంటాయి. SBI క్రెడిట్ కార్డులతో కొంటే 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందొచ్చు. 

Post a Comment

0Comments

Post a Comment (0)