అప్పగింత

Telugu Lo Computer
0


ఆడపిల్ల పుడితే...ఇంకోసారి లక్ష్మీ దేవి ఇంటికి వచ్చిందంటారు..

మనసున్న తల్లిదండ్రులు...
మనులేని వాళ్ళు.. పెట్టే పేరు " మైనస్ "
డబ్బు జబ్బు ఉన్న ఒకాయన భార్య పురిటి నొప్పులు పడుతున్న సమయంలో... ఈయన గారు కుడి జేబులో వెయ్యి ...ఎడమ జేబులో ఐదొందలు పెట్టుకుని హాస్పటల్ కు బయల్దేరాడు...నర్స్ కు gift ఇవ్వడానికి..
ఈపాటికి story మీకు అర్థం అయిందనుకుంటున్నా...దౌర్భాగ్యపు బ్రతుకులు.... అంతే..
తిరిగి తిరిగి అలసి వచ్చి ....నేలమీద కూర్చుని కుటుంబం అంతా కలసి భోజనం చేస్తున్న సమయంలో .......ఈ బుజ్జి కూచి " నాన్నా " అంటూ పరుగెట్టుకొచ్చి ..........వీపుమీద వాలి...మెడచుట్టూ చేతులు వేసి..గోరు ముద్ద కోసం నోరు ఎదరకు జాపితే...ఎక్కడ కారం తగులుతుందోనని..ఓ నేతి చుక్క కలిపి మరీ నోట్లో ముద్ద పెట్టే మాధుర్యాన్ని... ఏ తండ్రి మనసు మర్చిపోగలదూ...
పిల్ల బోర్లా పడినప్పుడు...అదో మొదటి పండుగ
నేలమీద ప్రాకుతూ ...
బుడి బుడి అడుగులు వేస్తూ..
గుమ్మం దాటిందని...మనమే చేయి అందించి
లేత పాద ముద్రలకు తోడయ్యే...తల్లిదండ్రులకు....కేలండర్ లోని పండగలకన్నా...ఇంట్లో జరిగే ప్రతీ మార్పుకు..
ఇల్లంతా పందిరే...హద్దులు లేని ఆనందాలే..
చూస్తూ ఉండగానే... అత్త, ..తాత...అమ్మా..అమ్మమ్మా.
.ఇలా..అలా...
పలుకుల్లోంచి...
అందరిలో అడిగే అసందర్భపు ప్రశ్నలు దాక..
చక్రం గిర్రున తిరిగిపోతుంది...
ప్రతీదీ...ఘట్టం ....రుచికి అతీతమైన.. ఓ తియ్యని జ్ఞాపకం...
జరిగిన ప్రతీ సందర్భం... ఓ మధురానుభూతి..
ఇంకా...ముచ్చట ఏవిటంటే...అమ్మాయి కి ఎన్నో రకాల గౌన్లు...మొడల్ డ్రస్ లు...వీటిని select చేసే సమయంలో భార్యాభర్తల మద్య అరుపులు.. అభిప్రాయబేధాలు...
పాపకు లెక్కలు హోం వర్క్ దగ్గర... తండ్రి ఓ టీచర్ అవతారం...
పద్దతులు నేర్చే చోట...తల్లి ఓ నిత్య గురవు అవతారం..
తాత, భామ్మ లయితే...సాంప్రదాయాలు నేర్పే సద్గురువుల అవతారం...
వెరసి...చూస్తూండగా... బయటి వాళ్ళకు పెద్దదయిపోయి.....ఇంట్లో వాళ్ళకు మాత్రం లేత బుజ్జాయి..
అలా హల్లోంచి అమ్మాయి వేసే ప్రతీ అడుగుతో వచ్చే కాలి పట్టీల చప్పుళ్ళు...
అచ్చు...నాట్య దేవత మనింట్లోనే ఉందా..అని అనిపించే ఓ సగటు నాన్న మనసు...
ఈ పిల్ల విషయంలో...బయట ప్రపంచంతో సంబంధం లేని ఈ
తండ్రి కి...ఇంకా ఒళ్ళో తలపెట్టి పడుకున్న ఓ ముత్యపు ముద్ద లా...
తల్లి కి...ఇంకా నోట్లో దువ్వెనె అడ్డంగా పెట్టుకుని రెండు జడలు వేస్తున్న కూచి లా...
కనిపిస్తుంది..
చదివిస్తున్న కాలేజ్...టపర్ గా వచ్చినప్పుడు..Function లో..తన కూతురు ని...ఇంటిపేరుతో కలిపి మైకులో పిలిచినప్పుడు..
వీక్షకుళ్ళో ఓ మూల కూర్చొన్న తల్లిదండ్రులకు..
ఒక్కసారిగా ఒళ్లు పులకరించి..మమేకమయ్యే లోపు..ఛంగు ఛంగు మంటూ...పట్టు పరికణీతో.వేదికమీదకు వెళ్లి.. పేరున్న ప్రముఖుల చేతులమీదుగా... అవార్డును అందుకుని...తోటివారి తప్పట్లతో..ఆడిటోరియం మారుమ్రోగుతుంటే.....
తీసుకున్న మెమెంటో ఒక చేత్తో...ప్రైజ్ మరో చేత్తో...విప్పారిన కళ్ళతో... తన క్లాస్ మేట్ ల అరుపుల మద్య..
అమ్మని...నాన్న ని వెతుక్కుంటూ వచ్చి...మీ ఒళ్ళో వాలిపోయి...ఒక్కసారిగా అవన్నీ మీ ఒళ్ళో విసిరేసి...వాళ్ళ bench mates దగ్గరకు వెళ్తున్న..
ఆ పట్టు పరికిణీ పిల్లను...
ఎవరు పట్టుకోగలరూ...
ఇంతలో ఓ పెళ్ళికెళ్తే...
ఓ పెద్దావిడ.....ఏవర్రా...సంబంధాలు ఏవన్నా చూస్తున్నారా????
అన్న మాటలకు...ఒక్క సారిగా...ఆ అమ్మ, నాన్నలకు...మనసుకు ఏదో అనిపించి..ఒకళ్ళనొకళ్ళు చూసుకుని...
ఇంటికొచ్చాక...ఆ రాత్రి.. అలా మంచం మీద నడుం వాల్చాకా..
ఆ పెద్దావిడ మాటలు ఇద్దరికీ.. చెవుల్లో మళ్ళీ మళ్ళీ మ్రోగుతూ..
" ఏవండీ...అంటూ ఆ బాధ్యతగా..గొంతు సవరించుకుని...నిన్న పెళ్ళి లో మా మేనత్త అన్న మాటలు నిజమేననిపిస్తోందని..
సంబంధాలు చూడటం మొదలు పెడదామా ?? అని...
ఎక్కడ పెళ్ళయితే తన కూతురు తనను విడిచి వెళ్లిపోతుందోనని...లోపల పూడిపోయిన.. గొంతు..చెప్పాలనుకున్న మాటలకు సహకరిచని ఆ సమయంలో....ఇంకా చదివిద్దాం..ఫర్వాలేదులే...కనీసం ఆ PG వరకూ..( మనసు.. ఇంకో రెండేళ్ళు నాతోనే ఉండాలన్న మది కోరికను..సమర్దించుకొంటూ)..
చూస్తుండగానే... ఓ మంచి సంబంధం.. అబ్బాయికి అమ్మాయి నచ్చింది...అటు ఇటు పెద్దలకు సమ్మతి అయింది.. మంచి ముహూర్తం కూడా చూసేశారు...కుటుంబ బ్రహ్మ గారు..
పెళ్ళి పనులు హడావిడి మొదలైన దగ్గర నుంచి...పైకి ఉత్సాహం.. లోపల ఎక్కడో తెలియని ఓ బెంగ..చెప్పుకుందావని..భార్యను పిలిస్తే.. వంటింట్లో వాళ్ళమ్మతో..."పెళ్ళి సారి " కి ఏం పెట్టాలో .చర్చలో ఉంది..
అలసిన శరీరాన్ని... మనసు పడుకోబెట్టలేక..ఇంక వారం లోకి వచ్చేసిందని..తుళ్ళిపడి లేచి...ప్రక్క గదిలోకెళ్ళి..నిద్రలో ఉన్న అమ్మాయికి దుప్పటీ కప్పి.." నా గారాల పట్టీ "..అనే పదం మనసులో పదె పదే అనుకుంటూ... కళ్ళల్లోంచి వచ్చిన నీటి చుక్కలు..కప్పిన దుప్పటి మీద పడుతూంటే..
భుజం మీద ఏదో చెయ్యి వాలి..నిమురుతోంది..తలెత్తి చూస్తే...భార్య..
ఏవండీ నాకు మాత్రం బెంగ లేదనుకుంటున్నారా...అది మనస్సులోనే ఉంచుకోవాలి... ఇలా అయితే ఎలా రండి..పడుకోండి...అంటూ సర్దిచెప్పుతుంది..
అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు.. ఎక్కడా రాజీ మనస్తత్వం లేని దంపతులు..
ఇంతలో బ్రహ్మ గారినుంచి ఓ అరుపు..ఏవండీ ఆడపెళ్ళి వారినీ...మగ పెళ్ళి వారినీ రమ్మనండి..తదుపరి కార్యక్రమం.
." అప్పగింతలు"
అందరికీ వినపడింది..కాని వినపడనట్లే...చూస్తూ..గుండెల్లో పరుగెడుతున్న రైలు చప్పుళ్ళు...ఒక్కసారిగా ముచ్చెమటలు..
అప్పటికే...అరగంటనుంచి తన కూతురుకేసే అలా చూస్తున్న తండ్రిని...తల్లిని..పీటలమీద కూర్చోబెట్టి.. వేదమంత్రాల సాక్షి గా..
అమ్మాయి అరచేతులు పాల పళ్ళెంలో ముంచి..అబ్బాయి అరచేతులో మూడుసార్లు పెట్టి...తర్వాత అతని తల్లిదండ్రులు, తోబుట్టువులు.. అందరికి మనసా, వాచా, కర్మణా..అప్పగించి...పంతులు గారి అఖరిమాట...ఈ సమయంనుండి మీ అమ్మాయిని వీరికి శాస్త్ర బద్దంగా
" అప్పగించేశారు " అని..
గభాలున లేచి అమ్మాయిని హత్తుకుని ప్రక్కనున్న గోడవైపు తిరిగి..ఎక్కెక్కి ఏడుస్తున్న నాన్న..అమ్మ...తమ్ముడు,
బరువెక్కిన హృదయాలు..
బాధ్యతను గర్తు ఎరిగిస్తున్న శరీరాలు..
కళ్ళముందు.. మరో సారి..లేత ఆవు దూడ లా ఛంగు ఛంగుమని మనింట్లో గంతులేసిన మన పిల్ల..ఇలా..పట్టు చీరలో...ఆభరణాలతో..ఓ పెద్ద ముత్తయిదువ అయ్యిపోయి..నాన్నా వెళ్ళొస్తానే అంటూంటే....ఇంకోసారి " నాన్నా " అని పిలవ్వా అంటూ.. హత్తుకుని..ప్రక్కనున్న వరుడి చేతులు నిమురుతూ...ఈ పిచ్చి తండ్రి... మాటలురాని చూపులతో..కళ్ళముందు కారెక్కివెళ్తున్న కూతురుని చూస్తూ....
" అరచేతుల్లోంచి ఓ పక్షి... ఇక్కడ ప్రేమను పెంచి..అక్కడ అదే ప్రేమను పంచడానికి " వేళ్తోందని...సర్ది చెప్పుకొనే సగటు జంట..మన సాంప్రదాయిక తల్లిదండ్రులు...
మీ రవి పరస .. మిమ్మల్ని ఏడిపించాడు గదూ...
లేదండీ...
ఓ సారి మీ మనసుతో మాట్లాడేను...అంతే..
ఇంకెందుకు ఆలస్యం.. ఓ సారి మీ అమ్మాయిని పిలిచి... అలా ఒళ్ళో కూర్చోబెట్టుకుని...అమ్మను తల్చుకుని ముద్దాడండి...దూరంగా ఉంటే Phone లో పలకరించండి....ఎందుకంటే...ఏదో ఓ కుటుంబానికి అప్పగించాకా...." ముద్దు " కు కాదుగదా.." మాటకు " కూడా అందనంత దూరంలో ఉంటుంది మరి..
అందుకే పెద్దలు "మాటల్లో మాటగా " అంటూ ఉంటారు..
" ఆడపిల్ల గా పుట్టడం కంటే అడవి లో మ్రానుగా పుట్టడం మేలని...అదైతే ఎక్కడ పుట్టిందో అక్కడే ఉంటుంది.. "..
కానీ మన ఈ ఆడపిల్ల... అక్కడా..ఇక్కడా ...ఎక్కడయినా... తన బాధ్యత ఒక్కటే..
గౌరవం...
సాంప్రదాయం..
విలువలు...
చివరకు...ఏ పేరైతే...ఏమి...అడ జన్మకు సార్దకం అయ్యిందా...లేదా...
ఈ జన్మకు ఇదే నా బహుమతి.. అమ్మకు..నాన్నకు...ఎక్కడ ఉన్నా...
ప్రపంచం సంగతి నాకు తెలియదు..
నా...కుటుంబానికి...
నేను ..." పరిపూర్ణ మహిళను "..
" నాన్న కూచిని ".. " అమ్మ కోరిక " ను.
చివరగా..
" కూతురంటే అమ్మకు ప్రతిరూపం.. నాన్నకు అదే లోకం".

Post a Comment

0Comments

Post a Comment (0)