ధోలవీరకు యునెస్కో గుర్తింపు !

Telugu Lo Computer
0

 


గుజరాత్ లోని కచ్ జిల్లాలో ఉన్న ధోలవీరకు యునెస్కో గుర్తింపు దక్కింది. గుజరాత్ లోని ధోలవీర ప్రాంతాన్ని ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో చేర్చింది. హరప్ప నాగరికతకు ధోలవీర నగరం ఓ గుర్తింపుగా నిలుస్తుంది. ఈ విషయాన్ని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి తన ట్విట్టర్ లో తెలిపారు. ధోలవీర ఇప్పుడు భారత్ లో 40వ వారసత్వ సంపదగా నిలుస్తుందని మంత్రి పేర్కొన్నారు. వరల్డ్ హెరిటేజ్ సైట్లలో ఇండియా సూపర్ పార్టీ క్లబ్ లో చేరింది. ఇండియా గర్వపడాల్సిన రోజని ముఖ్యంగా గుజరాతీ ప్రజలకు ఇది శుభ దినమని అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)